మన జ్యోతిష శాస్త్రంలో బృహస్పతి గ్రహంకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాల్లో ‘గురుడు’ లేదా ‘బృహస్పతి’ను దేవతల గురువుగా భావిస్తారు. జ్ఞానం, ధనం, వివాహం, సంతానం వంటి కీలక జీవిత అంశాలకు ఈ గ్రహం ముఖ్య కారకుడు. బృహస్పతిని ప్రసన్నం చేసుకోవాలంటే శాస్త్రోక్తంగా గురువారం ఉపవాసం చేయడమే ఉత్తమ మార్గంగా చెబుతారు.
ఇది కేవలం ఒక ఆచారం కాదు… మన జీవన ప్రయాణాన్ని సానుకూలంగా మలిచే ఓ దివ్య ఆధ్యాత్మిక సాధన.
గురువారం – దేవగురువు బృహస్పతికి అంకితం
గురువారం రోజును బృహస్పతి గ్రహానికి అంకితం చేశారు. ఈ రోజున శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా గురు బలవంతమవుతాడు అనే విశ్వాసం ఉంది. బృహస్పతి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రుడు. అందువల్ల గురువారపు ఉపవాసం ద్వారా రెండు ప్రయోజనాలు లభిస్తాయి:
- గురుగ్రహ శుభ ఫలితాలు
- విష్ణు లక్మీ అనుగ్రహం
ఎందుకు బృహస్పతిని శక్తివంతంగా చేసుకోవాలి?
జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్నప్పుడు:
- వివాహం ఆలస్యం అవుతుంది
- సంతాన సంబంధిత ఇబ్బందులు
- ఆర్థిక ఇబ్బందులు
- విద్యలో ముందుకెళ్లలేకపోవడం
- శుభమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది
ఈ కారణంగా గురువారపు ఉపవాసం, పూజలు ద్వారా బృహస్పతిని బలపరచవచ్చు.
వివాహానికి ఎదురవుతున్న అడ్డంకులకు పరిష్కారం
అన్ని జాతకాల్లో కూడా వివాహానికి ముఖ్యమైన గ్రహం – బృహస్పతి.
పెళ్లి ఆలస్యం అవుతున్న యువతులు, పునర్వివాహం కోసం ఎదురుచూస్తున్న మహిళలు, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు గురువారం ఉపవాసాన్ని పాటిస్తే –
వివాహ యోగం త్వరగా కలుగుతుంది
ఉత్తమ దాంపత్య జీవితం లభిస్తుంది
వివాహిత మహిళలు తమ భర్తల ఆరోగ్యానికోసం, దీర్ఘాయుష్సు కోసం ఈ ఉపవాసాన్ని ఆచరిస్తారు. ఇది శుభదాయకమైన పరమార్థం.
సంతాన లాభం కోసం బృహస్పతిని ప్రార్థించాలి
బృహస్పతి సంతానకారకుడు. కొన్ని జంటలకు సంతాన లాభం ఆలస్యం అవుతుంది. వైద్యపరంగా, శారీరకంగా సరైన పరిస్థితులున్నా… మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంటుంది.
అలాంటి వారు గురువారపు ఉపవాసాన్ని ఆచరిస్తే:
- మానసిక స్థితి మెరుగవుతుంది
- శారీరక, ఆధ్యాత్మిక స్థితి సంతాన యోగానికి అనుకూలంగా మారుతుంది
- బృహస్పతి అనుగ్రహంతో సంతానం కలుగుతుంది
గురువారపు ఉపవాసం ఎలా చేయాలి?
ఉదయం లేచి స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించాలి
పసుపు, గంధం, పసుపుపువ్వులతో విష్ణువు మరియు లక్ష్మీదేవిని పూజించాలి
బృహస్పతి గాయత్రీ మంత్రం లేదా గురు బీజమంత్రం జపించాలి
ॐ बृं बृहस्पतये नमः
ఓం బృం బృహస్పతయే నమః
పసుపు రంగు వస్త్రాలు ధరించాలి
పసుపు లేదా కందిపప్పుతో తయారైన నైవేద్యం సమర్పించాలి
ఊరం లేకుండా లేదా పాలు/ఫలహారం తీసుకుంటూ ఉపవాసం పాటించాలి
ధనానికి, శ్రేయస్సుకు బృహస్పతి అనుగ్రహం
ఆర్థిక ఇబ్బందులు, వ్యాపారలో నష్టాలు ఎదురవుతున్నా – బృహస్పతిని ప్రసన్నం చేసుకుంటే మీ సంపద యోగం పెరుగుతుంది.
ఉద్యోగ అవకాశాలు
వృద్ధి చెందే ఇన్వెస్ట్మెంట్లు
ధనసంబంధిత నిర్ణయాల్లో విజయం – ఇవన్నీ బృహస్పతి కరుణ వల్లే.
గురువారపు ఉపవాసం వల్ల మీరు ఆర్థికంగా స్థిరపడతారు. ధనం, విలువలు, గౌరవం పొందుతారు.
ఉపవాసం వల్ల పొందే ఆధ్యాత్మిక లాభాలు
- మనస్సు ప్రశాంతతతో నిండిపోతుంది
- జ్ఞానోదయం, చిత్తశుద్ధి కలుగుతుంది
- కర్మ ఫలాలను శుభంగా మార్చే అవకాశం పెరుగుతుంది
- శరీర శుద్ధి – మానసిక ఉల్లాసం
ఇవి ఒక్కోటి మన జీవిత నాణ్యతను మెరుగుపరిచే మార్గాలు.
గురువారపు పూజలో పాటించాల్సిన పద్ధతులు:
పసుపు రంగు పుష్పాలు వాడాలి
శ్రీమహావిష్ణువు నామస్మరణ చేయాలి
లక్ష్మీస్తోత్రాలు, గురు కవచం చదవాలి
పొద్దున సూర్యోదయం తర్వాత మృదువుగా పూజ చేయాలి
ఉపవాసం సాయంత్రం ఫలహారంతో ముగించాలి
గురువారపు ఉపవాసం అనేది కేవలం శరీర దాహం, ఆకలిని తట్టుకోవడం కాదు – ఇది మన ఆత్మకు చేసే సాధన. జీవితంలోని వివిధ రంగాల్లో ఉన్న అడ్డంకులు తొలగించి… వివాహం, సంతానం, సంపద, శ్రేయస్సు వంటి ఆశయాలను సాధించేందుకు ఇది అత్యంత శక్తివంతమైన మార్గం.