కంచి అనగానే గుర్తుకు వచ్చే దేవత కామాక్షిదేవి. కంచి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా కంచి కామాక్షిని దర్శించుకుంటారు. అయితే, అమ్మవారు ఆలయంలో ఐదు రూపాల్లో దర్శనం ఇస్తారని, ఈ ఐదు రూపాలనే పంచ కామాక్షి రూపాలు అని పిలుస్తారు. ఇందులో మొదటిది శ్రీ స్వయంభూ కామాక్షి రూపం. ఇది ఆలయంలోని ప్రధాన మూలవిరాట్ రూపం. అమ్మవారు ఆలయంలో స్వయంభూవుగా అవతరించారని అంటారు. మూలవిరాట్ రూపంలోని అమ్మవారు యోగనిద్రలో ఉంటారు. ఇక రెండో రూపం శ్రీ ఊర్ధ్వ కామాక్షీ రూపం. ఓంకారాన్ని సూచిస్తూ తలను పైకెత్తిన రూపంలో కనిపిస్తారు. జ్ఞానం, ఆధ్యాత్మిక లోకారోహణకు సూచికంగా అమ్మవారు దర్శనమిస్తారు. శ్రీ కులకామాక్షిగా మూడో రూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. ఇక్కడి అమ్మవారిని శ్రీవిద్యా ఉపాసకుల కులదేవతగా పూజిస్తారు. అమ్మవారిని తంత్ర మార్గంలో పూజించే దేవతగా కొలుస్తారు. శ్రీ శ్రింగేరి కామాక్షి అమ్మవారిగా నాలుగో రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఆదిశంకరాచార్యుల ఆశీర్వాదంతో శ్రింగేరి శారదా పీఠంలో ప్రతిష్టించబడిన రూపాన్ని కామాక్షిదేవిగా ఆరాధిస్తారు. ఇక్కడ అమ్మవారిని త్రిపుర సుందరి రూపంగా ఆరాధిస్తారు. శ్రీ విశాలాక్షి కామాక్షిగా ఐదోరూపంలో అమ్మవారు దర్శనం ఇస్తారు. అమ్మవారు విశాల దృష్టి కలదిగాను, అందరినీ అనుగ్రహించే దేవత రూపంలోనూ ఆరాధిస్తారు. ఈ ఐదు రూపాలను ఎవరైతే దర్శించుకుంటారో వారికి కామకోటి సిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కంచీపురంలో ఒకే చోట అమ్మవారి విభిన్నరూపాలు ఉండటం అరుదైన విషయాల్లో ఒకటిగా పండితులు చెబుతున్నారు.
Related Posts

ఈ ఆషాఢంలో అష్టాహ్నిక వత్రం చేస్తే… మీరే సిద్దపురుషులు కావొచ్చు
ఆషాఢ అష్టాహ్నికాలు – విశిష్టత, విధానాలు, దేవతాగణ సేవలో మన ఋషుల సంకల్పం భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికీ, ప్రతి పక్షానికీ, ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత…
ఆషాఢ అష్టాహ్నికాలు – విశిష్టత, విధానాలు, దేవతాగణ సేవలో మన ఋషుల సంకల్పం భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికీ, ప్రతి పక్షానికీ, ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత…

జీవితాన్ని మార్చే సుబ్రహ్మణ్య షష్టి…నియమాలు ఇవే
పండుగ విశేషాలు: ఈరోజు ఆషాఢ శుక్ల పక్ష షష్ఠి నాడు స్కంద షష్ఠి (లేదా కుమార షష్ఠి) అనే పవిత్రమైన పండుగను భారతదేశంతో పాటు నేపాల్, శ్రీలంక,…
పండుగ విశేషాలు: ఈరోజు ఆషాఢ శుక్ల పక్ష షష్ఠి నాడు స్కంద షష్ఠి (లేదా కుమార షష్ఠి) అనే పవిత్రమైన పండుగను భారతదేశంతో పాటు నేపాల్, శ్రీలంక,…

మూలాధార చక్రం ఒక్కసారి యాక్టివైతే… జీవితం ఎలా మారుతుందో తెలుసా?
మూలాధార చక్రం — మనిషి శరీరంలో ఉన్న ఆరో ముఖ్యమైన చక్రాలలో ఇది ప్రథమమైనది. ఇది భూమి తత్వానికి, మన భౌతిక స్థిరత్వానికి, భయ నివారణకు ఆధారమైన…
మూలాధార చక్రం — మనిషి శరీరంలో ఉన్న ఆరో ముఖ్యమైన చక్రాలలో ఇది ప్రథమమైనది. ఇది భూమి తత్వానికి, మన భౌతిక స్థిరత్వానికి, భయ నివారణకు ఆధారమైన…