జాతకంలో అన్నిగ్రహాలు అనుకూలంగా ఉంటేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఏ గ్రహమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటే దాని ప్రభావం జీవితంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బుధగ్రహం అనుకూలంగా లేకుంటే బుద్ధి, వ్యాపారం, విద్య, వాణిజ్యం, లావాదేవీల వంటి రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిర్ణయాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. ఆలోచనలు అస్పష్టంగా ఉంటాయి. చదువు పట్ల శ్రద్ధ తగ్గిపోతుంది. పరీక్షల్లో విఫలం అవుతుంటారు. తెలివితేటలు క్రమంగా తగ్గిపోతుంటాయి. మాటల్లో తప్పులు దొర్లుతుంటాయి. అపార్థాలకు తావుంటుంది. సంబంధాల్లో విబేధాలు కలుగుతాయి. వ్యాపారంలో నష్టాలు తప్పకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో మోసాలు జరుగుతాయి. బుధుడి అనుగ్రహం లేకుంటే నాడీ సంబంధిత సమస్యలు ఉత్పన్నమౌతాయి. మతిమరుపుతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చర్మసంబంధిత వ్యాధులతో సతమతమౌతారు. బుధగ్రహ దోషాలను నివారించాలంటే ప్రతిరోజూ ఓం బ్రాం బ్రీం బ్రౌం సం బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. బుధవారం రోజున ఉపవాసం ఉంటూ పచ్చి మొక్కజొన్నను, పచ్చి కూరగాయలను దానం చేయాలి. బుధవారం రోజున పచ్చని దుస్తులు ధరించాలి. బుధవారం రోజున తులసిమొక్క దగ్గర దీపం వెలిగించాలి. వీలైనంత వరకు చదువుపై దృష్టిపెట్టాలి. ఏ విషయంపైనైనా సరే స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోవాలి.
Related Posts

రథయాత్రలో హారతి దర్శనం…చూసినవారి జన్మధన్యం
రథయాత్ర విశేషాలు: పురాణ ప్రసిద్ధి కలిగిన పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర అనేది ఆషాఢ శుక్ల ద్వితీయ నుండి తొమ్మిదవ రోజుకు మధ్య జరిగే భక్తి, శ్రద్ధల…
రథయాత్ర విశేషాలు: పురాణ ప్రసిద్ధి కలిగిన పూరీ శ్రీ జగన్నాథ రథయాత్ర అనేది ఆషాఢ శుక్ల ద్వితీయ నుండి తొమ్మిదవ రోజుకు మధ్య జరిగే భక్తి, శ్రద్ధల…

కలలో గణపతి ఇలా కనిపిస్తున్నాడా…మీపంట పండినట్టే
దేవతల్లో ప్రధమ పూజ్యనీయుడిగా గణపతిని పూజిస్తాము. కేతు గ్రహ ప్రభావం నుంచి బటయపడేందుకు గణపతిని ఆరాధించాలని చెబుతారు. ఏ పూజ మొదలు పెట్టిన మొదటి పూజ గణపతికే…
దేవతల్లో ప్రధమ పూజ్యనీయుడిగా గణపతిని పూజిస్తాము. కేతు గ్రహ ప్రభావం నుంచి బటయపడేందుకు గణపతిని ఆరాధించాలని చెబుతారు. ఏ పూజ మొదలు పెట్టిన మొదటి పూజ గణపతికే…

శని దేవుడు చెప్పిన పడమర ముఖద్వారం కథ… మంచిదే కానీ
వాస్తుశాస్త్రం… మన భారతీయ సంస్కృతిలో ఇంటిని కట్టుకునే ముందు మొదట గుర్తు చేసుకునే శాస్త్రం. ఇది కేవలం గోడలు ఎక్కడ ఉండాలో చెప్పడం మాత్రమే కాదు… మన…
వాస్తుశాస్త్రం… మన భారతీయ సంస్కృతిలో ఇంటిని కట్టుకునే ముందు మొదట గుర్తు చేసుకునే శాస్త్రం. ఇది కేవలం గోడలు ఎక్కడ ఉండాలో చెప్పడం మాత్రమే కాదు… మన…