గ్రామదేవతగా పుంగనూరులో వెలసిన మారెమ్మ తల్లి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజైన నేడు అమ్మవారిని వేపాకు పచ్చడితో అలంకరించారు. వేపాకును మెత్తగా నూరి అమ్మవారికి ముఖానికి రాసి, వేపదండలు, పూలమాలలతో అలంకరించారు. పలురకాలైన వ్యాధులు, మహమ్మారుల నుంచి అమ్మవారు రక్షిస్తారని, ఇందులో భాగంగానే దసరా నవరాత్రుల్లో తొమ్మిదో రోజున అమ్మను ఇలా అలంకరిస్తారని పూజారులు చెబుతున్నారు. ఏడాదిలో ఒక్కమారు అదీ కూడా తొమ్మిదో రోజు మాత్రమే ఇటువంటి అలంకరణ ఉంటుంది. ఈ ఒక్కరోజు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటే ఏడాదిపాటు ఇబ్బందులు, రోగాల బారినుంచి బయటపడొచ్చని భక్తులు చెబుతున్నారు. దీనికోసమే తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో మారెమ్మ ఆలయానికి వస్తారు. అయితే, అమ్మవారికి అలంకరణ పూర్తయ్యాకే సామాన్య భక్తులు దర్శించుకోవడానికి అనుమతి ఇస్తారు.
Related Posts
భధ్రాచల మహత్యంః అంతా రామమాయా… ఆ లేఖ రాజుకు చేరుంటే…
Spread the loveSpread the loveTweetభద్రాచలం గుడి చరిత్రలో ఒక పవిత్ర శకానికి పునాది భద్రాచలంలో ఉన్న శ్రీరామాలయం గల గాథ ఎంత గొప్పదంటే, అది భక్తి భావానికి ప్రత్యక్ష…
Spread the love
Spread the loveTweetభద్రాచలం గుడి చరిత్రలో ఒక పవిత్ర శకానికి పునాది భద్రాచలంలో ఉన్న శ్రీరామాలయం గల గాథ ఎంత గొప్పదంటే, అది భక్తి భావానికి ప్రత్యక్ష…
అయోధ్య రామాలయం ఎలా ఉందో చూశారా?
Spread the loveSpread the loveTweetఅయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు…
Spread the love
Spread the loveTweetఅయోధ్య రామాలయం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరిలో ఆలయాన్ని పూర్తి స్థాయిలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. దేవాలయానికి సంబంధించిన అన్ని పనులు…
ఈ ఆషాఢంలో అష్టాహ్నిక వత్రం చేస్తే… మీరే సిద్దపురుషులు కావొచ్చు
Spread the loveSpread the loveTweetఆషాఢ అష్టాహ్నికాలు – విశిష్టత, విధానాలు, దేవతాగణ సేవలో మన ఋషుల సంకల్పం భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికీ, ప్రతి పక్షానికీ, ఒక ప్రత్యేకమైన…
Spread the love
Spread the loveTweetఆషాఢ అష్టాహ్నికాలు – విశిష్టత, విధానాలు, దేవతాగణ సేవలో మన ఋషుల సంకల్పం భారతీయ సంస్కృతిలో ప్రతి మాసానికీ, ప్రతి పక్షానికీ, ఒక ప్రత్యేకమైన…