ఈ రోజు స్మార్త,మాధ్వ నిర్జల ఏకాదశి. భీమ ఏకాదశీ అని కూడా పిలుస్తారు. బ్రహ్మ వైవర్త పురాణము ప్రకారం, పాండవులలో రెండవవాడు అయిన భీముడు మంచి తిండి పుష్టి కలవాడు,ఆకలికి తాళలేని వాడు. ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశీ అందరూ ఉపవాసం ఉంటుంటే, ఆకలికి తాళలేక తాను మాత్రం ఉండేవాడు కాదుట. గమనించిన వేద వ్యాసుడు, సంవత్సరంలో వచ్చే , 24 ఏకాదశీ ఉపవాసాలు ఆచరించక పోయినా ఈ జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉండమని, ఈ ఒక్క రోజు ఉపవాసం ఉంటే… సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశి రోజుల్లో ఉపవాసాలు ఉన్న ఫలితం ఉంటుందని భీమసేనుడుకి నచ్చచెప్పి, ఉపవాసం ఉండేలా చేసాడుట. అందుకని ఈ ఏకాదశిని భీమసేనీ ఏకాదశీ అని కూడా పిలుస్తారు. కాబట్టి సంవత్సరంలో వచ్చే అన్నీ ఏకాదశీ ఉపవాసాలు ఉండలేని భక్తులు కనీసం ఈ నిర్జల ఏకాదశీ ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన, సంవత్సరంలో అన్నీ ఏకాదశీ వ్రతాలను ఆచరించిన ఫలితం దక్కుతుంది అని నమ్మకం. ద్వాదశి హరి వాసరం రేపు ప.11.25 వరకూ ఉన్నందువలన ఈ రోజు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం రేపు మ.01.34 నుండి సా.04.12 వరకూ ఉంటుంది.
Related Posts

భగవంతుడి వైపుకు నడిపించే మౌనం
మౌనంగా ఉండేందుకు చాలా మంది ఇష్టపడరు. పక్కన ఎవరుంటే వారితో మాట్లాడటానికి ఇష్టపడుతుంటారు. ఈ భౌతిక ప్రపంచంలో కమ్యునికేషన్‌కు విలువ ఎక్కువని, కమ్యునికేషన్ లేకుంటే జీవనం సాగించడం…
మౌనంగా ఉండేందుకు చాలా మంది ఇష్టపడరు. పక్కన ఎవరుంటే వారితో మాట్లాడటానికి ఇష్టపడుతుంటారు. ఈ భౌతిక ప్రపంచంలో కమ్యునికేషన్‌కు విలువ ఎక్కువని, కమ్యునికేషన్ లేకుంటే జీవనం సాగించడం…

Panchangam 2025 జనవరి 16వతేదీ గురువారం
Panchangam అనేది భారతీయ కాలగణన ప్రకారం ప్రతి రోజు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వంటి అయిదు ముఖ్యమైన అంశాలను వివరిస్తుంది. ఇది శుభ సమయాలు,…
Panchangam అనేది భారతీయ కాలగణన ప్రకారం ప్రతి రోజు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వంటి అయిదు ముఖ్యమైన అంశాలను వివరిస్తుంది. ఇది శుభ సమయాలు,…

శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను విన్న నాలుగో వ్యక్తి ఎవరు?
సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన పవిత్ర సంప్రదాయం. ఇందులో అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయని మనందరికీ…
సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన పవిత్ర సంప్రదాయం. ఇందులో అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయని మనందరికీ…