తుమ్మిపువ్వులు గడ్డిజాతికి చెందిన మొక్కలు. సాధారణంగా ఇవి రోడ్డు పక్కన, పొలం గట్లమీద పెరుగుతుంటాయి. వీటిని మనం పెద్దగా పట్టించుకోం. కానీ, ఈ పువ్వులు మహాశివుడిని అత్యంత ఇష్టమైనవిగా చెబుతారు. ఈ తుమ్మి పువ్వులను భూతనాశక అని పురాణాలు చెబుతున్నాయి. ఇది చెడు శక్తులను తొలగించే శక్తి కలిగి ఉందని విశ్వాసం. ఈ పువ్వుల పేరుమీదగానే శివుడిని భూతనాధుడు అని పిలుస్తారు. భూతగణాలకు ఆయన అధిపతి. తుమ్మి పువ్వులు భూతగణాలను ప్రసన్నం చేస్తాయని, అందువలన శివుడి ఆరాధనలో వీటిని ఉపయోగిస్తారు. తుమ్మిచెట్టు శరీరాన్ని శుద్ధి చేసే తత్వాన్ని, రోగనాశనం చేసే గుణాలను కలిగి ఉంటుంది. మహాశివుడు శుద్దతకు ప్రతీక. అందుకే ఈ పువ్వులు శివారాధనలో తప్పకుండా ఉపయోగించాలని అంటారు. శివుని పూజలు తుమ్మి పువ్వులను సమర్పించడం వలన దోషాలు తొలగిపోతాయి. చేసిన పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు. అలంకరణ తత్వం లేని భగవంతుడు మహాశివుడు. అందుకే చిన్నదైన, సాధారణమైన తుమ్మిపువ్వును మహాశివుడిని శ్రద్ధతో సమర్పిస్తే ఆయన తృప్తి చెందుతారని, భక్తులను అనుగ్రహిస్తారని భక్తుల నమ్మకం. ఒక్క తుమ్మిపువ్వుతో శివుడిని పూజిస్తే సహస్ర పుష్పార్చన చేసిన ఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
Related Posts

సెప్టెంబర్ నెలలో శ్రీవారి దర్శనాలు…కోటా వివరాలు ఇవే
తిరుమల తిరుపతి దేవస్థానము (TTD) భక్తుల సేవలో ఎప్పుడూ ముందుండే సంస్థగా, ప్రతి నెల తరహా సేవా టికెట్లను, గదుల కోటాలను, ప్రత్యేక దర్శన టోకెన్లను ముందుగానే…
తిరుమల తిరుపతి దేవస్థానము (TTD) భక్తుల సేవలో ఎప్పుడూ ముందుండే సంస్థగా, ప్రతి నెల తరహా సేవా టికెట్లను, గదుల కోటాలను, ప్రత్యేక దర్శన టోకెన్లను ముందుగానే…

శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను విన్న నాలుగో వ్యక్తి ఎవరు?
సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన పవిత్ర సంప్రదాయం. ఇందులో అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయని మనందరికీ…
సనాతన ధర్మం అనేది వేల సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శకంగా నిలిచిన పవిత్ర సంప్రదాయం. ఇందులో అష్టాదశ పురాణాలతో పాటు అనేక ఇతర గ్రంథాలు కూడా ఉన్నాయని మనందరికీ…

పూరీ జగన్నాథ రథయాత్ర – తిరుగు ప్రయాణం ఎలా సాగుతుంది?
పూరీ రథయాత్ర వెనుక గొప్ప ఆధ్యాత్మిక గాధ పూరీ జగన్నాథ రథయాత్ర అనేది ప్రపంచంలోనే అత్యంత గొప్ప హిందూ ఉత్సవాల్లో ఒకటి. మామూలుగా మనం రథయాత్ర అంటే…
పూరీ రథయాత్ర వెనుక గొప్ప ఆధ్యాత్మిక గాధ పూరీ జగన్నాథ రథయాత్ర అనేది ప్రపంచంలోనే అత్యంత గొప్ప హిందూ ఉత్సవాల్లో ఒకటి. మామూలుగా మనం రథయాత్ర అంటే…