మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు గరుడపురాణం పరిష్కారం చూపుతుంది. ముఖ్యంగా జన్మ, కర్మ, మోక్షం వంటి వాటికి చక్కని పరిష్కారాలు చూపుతుంది. చేసిన చేస్తున్న కర్మలు ప్రస్తుత జీవితాన్నే కాదు…భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. సంసార చక్రాన్ని అర్ధం చేసుకోవడానికి, మోక్షం పొందడానికి కర్మలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. చేసిన కర్మలను అనుసరించి పునర్జన్మ ఉంటుంది. శరీరానికి మాత్రమే మరణం ఉంటుంది. ఆత్మలకు కాదు. జననం, మరణం, పునర్జన్మ… ఇలా ఆత్మ చైతన్యవంతంగా ఉంటూనే ఉంటుంది. అయితే, ఆత్మ మనిషిగా జననం తీసుకున్నప్పుడు కర్మల నుంచి విముక్తి పొందేందుకు అవకాశం లభిస్తుంది. ధర్మబద్ధంగా, ఇతర జీవుల పట్ల సానుకూల దృక్పధంతో, ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని కొనసాగించినపుడు ఆత్మకు పునర్జన్మ నుంచి విముక్తి లభిస్తుందని గరుడపురాణం తెలియజేస్తున్నది.
ఆత్మ నిత్య చైతన్యం. అది సంపూర్ణంగా మోక్షం పొందేవరకు నిరంతరం శరీరాలను మారుస్తూనే ఉంటుంది. మన కర్మలను బట్టి తరువాతి జన్మ ఉంటుంది. కర్మఫలం ఎప్పుడైతే శూన్యమౌతుందో అప్పడే దైవాన్ని చేరుకొని జన్మంచడం జరగదు. జీవులు ఎన్నో కోట్ల జన్మలు ఎత్తితేగాని మోక్షం లభించదు. ప్రతి వంద సంవత్సరాల కాలంలో ఒక్కరి ఆత్మ కూడా మోక్షాన్ని పొందలేదని, మార్గాన్ని ఎంచుకొని మంచి మార్గంలో నడిచే జీవులకు ఆ తరువాత జన్మలో అంతకంటే మంచి జన్మ లభిస్తుందని, పండితులు చెబుతున్నారు.