జ్యేష్టపౌర్ణమి రోజున తప్పకుండా 7 రకాలైన వస్తువులను దానంగా ఇవ్వాలని వేదపండితులు చెబుతున్నారు. అత్యంత విశిష్టమైన జ్యేష్టపౌర్ణమి రోజున చేసే దానాలు రెట్టింపు ఫలితాలను ఇస్తాయి. ఆధ్యాత్మికపరంగానే కాకుండా, పాప పరిహారాలు కూడా జరుగుతాయని, కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్టమాసంలో వర్షాలు కురుస్తాయి కాబట్టి పేదలకు గొడుగులు దనాం చేయాలని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా పేదలకు శుభ్రమైన వస్త్రాలను కూడా దానం చేయాలి. ఇలా చేయడం వలన ఆరోగ్యం కుదుటపడుతుంది. జీవితం ప్రశాంతంగా కొనసాగుతుంది. అన్నిదానాల్లోకి అన్నదానం మిన్న అంటారు. ఈ పౌర్ణమి రోజున అన్నదానం చేయడం వలన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. గురువులకు ఆసనాలను దానంగా ఇవ్వాలని శాస్త్రం చెబుతున్నది. ఇలా చేయడం వలన విద్యార్ధులకు విశేషమైన విద్య కలుగుతుందని అంటారు. బంగారం లేదా వెండితో చేసిన నాణేలను గణపతి లేదా లక్ష్మీదేవికి అంకితం చేయాలి. ఇలా చేయడం వలన కూడా ధనం వృద్ధి చెందుతుంది. పంచపాత్రలను కూడా దానం ఇవ్వాలి. ఇలా పంచపాత్రలను దానం ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మికంగా వృద్ధి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. జపమాల, శాలిగ్రామం, తులసి మొక్కలను కూడా పౌర్ణమికి దానం ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. వీటిని దానంగా ఇవ్వడం వలన మోక్షం లభిస్తుంది.
అసలు ఈ 7 వస్తువులను ఎవరికి దానంగా ఇవ్వాలి. అర్హులైన వారికి చేసిన దానమే శుభ ఫలితాలు ఇస్తుంది. పూజారులకు, పేద బ్రాహ్మణులకు, పేదలకు, అనాథలకు, వృద్ధులు, మహిళలకు, గురువులు, విద్యార్థులకు దానంగా ఇవ్వాలని వేద పండితులు చెబుతున్నారు. వీటిని దానం చేయడం వలన ప్రముఖంగా పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. ధనసంపద పెరుగుతుంది. భగవంతుని కృప మీపై ఉంటుంది. మానసికంగా శాంతి లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ప్రగతి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అన్ని పౌర్ణమి రోజుల్లో చేసే దానం కంటే ఈ జ్యేష్టమాసంలో వచ్చే పౌర్ణమిరోజున దానం చేయడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.