బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్… మన తెలుగు ప్రేక్షకులకు RRR తో బాగా ఫ్యామిలియర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన తెలంగాణ ప్రభుత్వం తో కలిసి హైదరాబాద్‌లో భారీ స్థాయిలో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముందుకు వచ్చారు.
ఇప్పటికే మీడియా లో వచ్చిన వార్తల ప్రకారం… డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే ప్రతిష్టాత్మక టెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో అజయ్ దేవగన్ అధికారికంగా MoU సైన్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్ తెలంగాణ ఫ్యూచర్ సిటీ లో జరగడం ఇంకా గ్రాండ్‌గా మారింది.
కొద్ది నెలల క్రితం అజయ్ దేవగన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కలిశారు. అప్పుడే ఆయన హైదరాబాద్‌లో వరల్డ్ క్లాస్ స్టూడియో ఏర్పాటు చేయాలన్న ఆలోచన చెప్పగా, ప్రభుత్వం కూడా పాజిటివ్‌గా స్పందించింది. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్ మీద పరుగెడుతోంది.

ఈ స్టూడియోలో cutting edge animation, హై లెవల్ VFX, AI ఆధారిత సినిమాటిక్ టెక్నాలజీస్ అన్నీ ఉండబోతున్నాయి. కేవలం ఎంటర్టైన్‌మెంట్ కోసం కాదు… సినిమా రంగంలో స్కిల్ ఉన్న యువత కోసం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తారు.
అంతేకాదు… ఈ సమ్మిట్‌లో ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి వైల్‌లైఫ్ కన్సర్వేటరీ & నైట్ సఫారి ప్రాజెక్ట్ కు కూడా ఒప్పందం చేసుకోబోతోంది. గుజరాత్‌లో ఉన్న వంతారా సేవా కేంద్రం లా ఇక్కడ కూడా భారీ స్థాయిలో వైల్డ్‌లైఫ్ టూరిజం ప్రోత్సహించబోతున్నారు.