నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 నుంచి మేకర్స్ సూపర్ అప్డేట్ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 5న గ్రాండ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతున్న ఈ మూవీ మొత్తం ఆడియో ఆల్బమ్‌ను విడుదల చేస్తూ అభిమానుల కు ట్రీట్ ఇచ్చారు. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ హైప్ క్రియేట్ అయింది.
థమన్ మరోసారి బాలయ్యతో తన బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ కాంబోను రిపీట్ చేస్తూ ఈసారి కూడా దైవభక్తి – పవర్ – ఎమోషన్లతో నిండిన ఆల్బమ్‌ను అందించాడు. మొదటిగా వైరల్ అవుతున్న “అఖండ తాండవం” సార్వేపల్లి సిస్టర్స్ గొంతుతో ఆవిర్భవించి ఆధ్యాత్మిక వైబ్రేషన్‌ను సరిగ్గా కలిగిస్తోంది.
గంగాధర శంకరా, హర హర, శాంబో వంటి ట్రాక్స్‌లో భక్తి, ఫోక్, మాస్ బీట్ల మిక్స్‌ని థమన్ అద్భుతంగా పండించాడు. “శివ శివ” మాత్రం సాఫ్ట్, ఎమోషనల్ వైబ్‌తో మరో దిశలోకి తీసుకెళుతుంది.
ఇక ఆల్బమ్ యొక్క మెయిన్ హైలైట్ అయిన “తాండవం” సాంగ్‌లో శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్, దీపక్ బ్లూ కలిసి పాడటం ఈ ట్రాక్‌కు హైప్ ని తెచ్చింది. ఆధ్యాత్మిక ఎనర్జీ, పవర్ఫుల్ కొరస్, మ్యాగ్నెటిక్ కంపోజిషన్ కలిసి ఈ పాటను ఆల్బమ్ స్టార్‌గా నిలిపాయి.
మొత్తానికి… తొమ్మిది ట్రాక్స్‌తో ఉన్న ఈ ఆల్బమ్ అఖండ 2 మీద ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్‌కు సరిపోయేలా థమన్ మ్యూజిక్ పూర్తిగా ఎనర్జీని అందించింది.