టాలీవుడ్‌లో బాలకృష్ణ – బోయపాటి శ్రీను సినిమా అంటే వేరే రేంజ్ ఎక్సపెక్టషన్స్ ఉంటాయి. ఇప్పుడు అఖండ 2 తో మళ్లి మనముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా పైన ఉన్న హైప్ కి కారణం:
🔹 ఇప్పటికే కల్ట్‌గా నిలిచిన అఖండ సినిమా
🔹 ఈ జోడి మార్క్ ఎమోషన్ + మాస్ ఫార్ములా
🔹 దేశవ్యాప్తంగా సనాతన ధర్మాన్ని పునరుజ్జీవింపజేస్తున్న ఆధ్యాత్మిక బ్యాక్‌డ్రాప్
🔹 ఇక ట్రైలర్ – పాటలు అయితే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తున్నాయి
ఇంతే కాదు… సినిమా రిలీజ్‌కి ముందే అఖండ స్థాయిలో బజ్ ఉంది!
ఇంకా ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ గురించి చెప్పాలంటే, థియేట్రికల్ + నాన్-థియేట్రికల్ డీల్స్ కలిపి 250 కోట్లకు పైగా వచ్చింది. ఇది బాలయ్య, బోయపాటి కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌కే రికార్డ్! బడ్జెట్ పెద్దదే… విజన్ కూడా అదే రేంజ్‌లోనే ఉంది. కానీ రిలీజ్‌కి ముందే నిర్మాతలకి భారీ లాభాలు వచ్చేసాయి. ఎంత పెద్ద మోషన్ పిక్చర్ అండ్ పబ్లిసిటీ ఉన్నా… సినిమా టీమ్ మీద ఇలా నమ్మకం పెట్టుకోవడం అరుదు.
ఇక ఈరోజు హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అక్కడి నుంచి వచ్చే హైప్ మరింత దూసుకెళ్తుంది.