రవి తేజ ‘భారత మహాసాయులకు విజ్ఞప్తి’ సినిమా ఫస్ట్ సింగిల్ ‘బెల్లా బెల్లా’ ఇందాకే రిలీజ్ అయ్యింది. ‘ధమాకా’ తర్వాత మాస్ మహారాజా రవితేజ–భీమ్స్ సిసిరోలియో కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో… ఈ పాట పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
భీమ్స్ తనకున్న స్పెషల్ మాస్–ఫోక్ వైబ్‌ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాడు. ట్రాడిషనల్ బీట్స్, లౌడ్ ఎనర్జీ, పక్కా ఫోక్ స్టైల్ అన్నీ ఉన్నాయి… ట్యూన్ కూడా కొన్ని చోట్ల క్యాచీగా కనిపిస్తుంది. సురేశ్ గంగులా రాసిన లిరిక్స్ ఫన్ మూడ్‌కి తగినట్టుగానే ఉన్నా… కొద్దిగా రిపిటేటివ్‌గా అనిపించే చోట్లూ ఉన్నాయి.
వోకల్స్ వరకూ వస్తే… నకాష్ అజీజ్, రోహిణి సోర్రాట్ ఇద్దరూ పాటకి మంచి పవర్ ఇచ్చారు. వారి ఎనర్జీ పాటను కాస్త డ్రైవ్ చేస్తుంది. కానీ మొత్తం మీద చూస్తే… సాంగ్ ఒక సరి మరీ బ్లాస్ట్ అనిపించదు. ఓకే అనిపించే రేంజ్‌లోనే ఉంటుంది.
విజువల్స్ మాత్రం కలర్ఫుల్గా, ఫారిన్ లొకేషన్స్‌లో గ్రాండ్‌గా తీశారు. రవితేజ తనకి సిగ్నేచర్ అయిన మాస్ మూవ్స్‌తో రెచ్చిపోయాడు. హీరోయిన్ ఆశిక కూడా ఆయనకి తగినట్టే ఎనర్జీ ఇచ్చింది. వీళ్ల కెమిస్ట్రీ వీడియోకి చక్కని స్పార్క్ ఇచ్చింది… ట్యూన్ అంత ఎలివేట్ కాకపోయినప్పటికీ.