తెలుగు సినీ పరిశ్రమలో హిట్ సినిమాలు అందించిన ప్రొడ్యూసర్ బన్నీ వాస్, ఈ సారి ఆయన ‘బీవీ వర్క్స్’ బ్యానర్‌పై రాబోతున్న సరదా, నవ్వులు పంచే ఎంటర్‌టైనర్ మిత్ర మండలి సినిమాకు ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు.
రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండడం తో ట్రైలర్‌ను ఈరోజే విడుదల చేశారు. ట్రైలర్‌లో యూత్ కి కావాల్సిన ఎనర్జీ, కామెడీ టైమింగ్, ఫ్రెండ్స్ కెమిస్ట్రీ—అన్ని కలిపి ప్రేక్షకులకు నవ్వుల విందు ఇచ్చేలా ఉన్నాయి. ప్రియదర్శి, ప్రసాద్ బేహరా, రాగ్ మయూర్, విశ్ణు ఓఐ ఫ్రెండ్స్‌గా కనిపించి, నవ్వుల పంట పంచారు…
వెన్నెల కిషోర్, సత్య, వీవీ గణేష్ వంటి స్టార్ కామెడీ నటులు తమ ప్రత్యేక హాస్యంతో సినిమాకు మరింత కలర్ జోడించారు. అలాగే వంశీధర్ గౌడ్, నిహారికా NM, సత్య నటన కూడా ట్రైలర్‌లో ఆకట్టుకుంది.
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.ఆర్. ధ్రువన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు కొత్త ఫ్రెష్‌నెస్ ఇచ్చింది. అనుదీప్ కెవి ఇంకా మరికొంతమంది నటులు చేసిన కెమియోలు థియేటర్లలో పెద్ద రియాక్షన్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
సో, ఫన్ ప్యాకేజ్‌గా వస్తున్నా మిత్ర మండలి అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.