ఒక MLA సైకిల్ పై అసెంబ్లీ కి వెళ్లడం చూసారా???
ఒక MLA ఒక చిన్న ఇంట్లో ఉండడం చూసారా???
ఒక MLA అతి సాధారణంగా ఉండడం చూసారా???
ఈ మూడు ప్రశ్నలకు సమాధానం గుమ్మడి నరసయ్య గారు… ఒకటి కాదు రెండు కాదు అయన 5 సార్లు MLA గా గెలిచి Yellendu ప్రజలకు సేవ చేసారు… అందుకే, ఈ గొప్ప మనిషి జీవితాన్నిపెద్ద తెర మీద చూపించేందుకు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే ముందుకు వచ్చారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ నర్సయ్య పాత్రలో నటించనుండటం ఈ సినిమాకే ఒక ప్రత్యేక గౌరవం. ప్రభల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎన్. సురేష్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిన్ననే ఈ సినిమా ఘనంగా పాల్వంచ లో లాంచ్ అయ్యింది…
ముహూర్త కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కవిత, మల్లూ భట్టి విక్రమార్క భార్య నందిని మల్లూ తదితరులు హాజరయ్యారు. గీతా శివరాజ్‌కుమార్ మొదటి క్లాప్ కొట్టగా, మంత్రి కోమటిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నందిని మల్లూ స్క్రిప్ట్‌ను టీమ్‌కు అందించారు.

ఈ సందర్బంగా డైరెక్టర్ పరమేశ్వర్ మాట్లాడుతూ —
“రాజకీయం ఒక ఉద్యోగం కాదు… ప్రజల నమ్మకాన్ని తిరిగి చెల్లించడానికి ఉన్న బాధ్యత” అని చెప్పారు. గుమ్మడి నర్సయ్య ఆ నిజాయితీతోనే 20 ఏళ్లు సేవ చేశారని, తన కోసం ఒక్క పైసా కూడ సంపాదించలేదని చెప్పారు. అలాంటి జీవితాన్ని ప్రపంచానికి తెలియజేయడం సినిమాకి ధర్మమని, ఈ ప్రాజెక్టును నమ్మి ముందుకు వచ్చిన శివరాజ్‌కుమార్, నిర్మాత సురేష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
నిర్మాత సురేష్ రెడ్డి కూడా మాట్లాడుతూ,
“నర్సయ్య పాత్ర పోషించడానికి శివరాజ్‌కుమార్ తప్ప మరెవరూ సరిపోరు… ఆయనలోని నిజమైన మనసు, సేవ భావం పాత్రకి అద్భుతంగా సరిపోతాయి” అన్నారు. పాల్వంచలో షూట్ ప్రారంభించడం గుమ్మడి నర్సయ్య జీవితం పుట్టిన నేల కాబట్టి అని తెలిపారు. ఈ సినిమా రాజకీయాల్లో మంచి మార్పుని రాబెడుతుందని ఆశించారు.
శివరాజ్‌కుమార్ మాట్లాడుతూ —
“ఇలాంటి మహోన్నత నాయకుడి పాత్ర పోషించే అవకాశం రావడం నా అదృష్టం. నర్సయ్య గారి ఇంటికి వెళ్లినప్పుడు గుండెల్లో ఒక భావోద్వేగం ఉప్పొంగింది” అన్నారు. తన పాత్రకి తానే డబ్ చేయడానికి తెలుగును నేర్చుకుంటున్నానని చెప్పారు. ఈ సినిమా కొత్త తరం నాయకులను కూడా ప్రేరేపిస్తుందని ఆశించారు.
చివరగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ —
“నేను ఓ సాధారణ మనిషిని… మార్పు అంటే ప్రతి మనిషిలోనుంచే మొదలవాలి” అన్నారు. ఈ సినిమా ఆ సందేశాన్ని అందరికీ చేరవేసి సమాజంలో మంచి మార్పు తేవాలని ఆశించారు.