భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఇళయరాజా పేరు తెలియని వారుండరు. అయన సంగీతం అంటే తరాలుగా మనం మురిసిపోయే మెలోడీలు, మనసును మత్తెక్కించే బాణీలు. అలాంటి లెజెండరీ మాస్ట్రో… తన పాటలు వేరేవాళ్లు వాడుకుంటే మాత్రం రాజీ పడడు. గత కొంతకాలంగా ఎవరైతే తన అనుమతి లేకుండా ఆయన పాటలను సినిమాల్లో ఉపయోగిస్తున్నారో… వారంతా కోర్టుల్లో కేసులు ఎదుర్కొంటున్నారు. ఇళయరాజా జీరో టోలరెన్స్ పాలసీకి ఇది పక్కా ఉదాహరణ.
ఈ సంవత్సరం మొదట్లో అజిత్ నటించిన ‘Good Bad Ugly ‘ టీమ్‌పై కేసు వేసి గెలిచారు. ఇప్పుడు మరోసారి అయన ఇంకో కేసు గెలిచాడు. ఈ మధ్యే దీపావళి సందర్భంగా విడుదలైన Dude సినిమాలో తన రెండు క్లాసిక్ పాటలను అనుమతి లేకుండా వాడారని ఇళయరాజా కోర్టులో పిటిషన్ వేసారు.
ఆ రెండు పాటలు… ‘Karutha Machan’, ‘Nooru Varusham Indha Maappillaum’ ఇవి అసలు సిసలు ఇళయరాజా మాస్టర్పీస్‌లు. వాటిని మార్చి, మిక్స్ చేసి, సినిమాలో వాడటం ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీశారని ఆయన వాదన. కోర్టు కూడా ఆయన మాటలకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
దాంతోనే… ఇళయరాజా పాటలను వెంటనే తీసేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఇంటరిమ్ ఇంజక్షన్ విధించింది.
మైత్రీ మూవీ మేకర్స్ ఒక వారం టైమ్ ఇవ్వమని కోరినా… జడ్జి సూటిగా “నో” అన్నారు.
రెస్పాండెంట్లు అయితే – “ఈ పాటల రైట్స్ సోనీ మ్యూజిక్ కొనుగోలు చేసింది, మాకు మ్యూజిక్ కంపెనీ పర్మిషన్ ఉంది” అని అంటుండగా… ఇళయరాజా తరఫు లాయర్ మాత్రం ఒకే మాటపై నిలదీశారు:
“పాటను సృష్టించింది కంపోజర్. కాబట్టి ఒరిజినల్ క్రియేటర్ అనుమతి తప్పనిసరి. మ్యూజిక్ లేబుల్ దగ్గర పేపర్ రైట్ ఉండొచ్చు… కానీ అసలు హక్కు ఆయనదే.”
తరచూ వరుసగా రెండు కేసులు గెలవడంతో ఇళయరాజా ఇప్పుడు స్పష్టమైన లీగల్ మెసేజ్ ఇచ్చాడు—
“మ్యూజిక్ కంపెనీ నుంచి రైట్స్ తెచ్చుకుంటే సరిపోతుందని ఎవరూ అనుకోకండి… కంపోజర్ పర్మిషన్ కూడా తప్పనిసరి.”
సంగీత దర్శకుడి క్రియేటివ్ హక్కులకు ఇది పెద్ద గౌరవం ఇంకా నిర్మాణ సంస్థలకు ఒక స్పష్టమైన హెచ్చరిక కూడా.
ముందుగా సరైన అనుమతులు తీసుకోకపోతే… ఇలాంటి కోర్టు కేసులు, ఆంక్షలు, నష్టాలు… చివరికి విడుదలైన సినిమా థియేట్రికల్ రన్‌కూ హాని కలిగిస్తాయి.