దసరా పండుగ వాతావరణంలో కాంతారా చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద నిజంగానే చరిత్ర సృష్టించింది. రిలీజ్ రోజు ప్రపంచవ్యాప్తంగా 89 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఇండియన్ సినిమాల అతి పెద్ద ఓపెనింగ్స్ లో ఒకటిగా నిలిచింది. ఒకే రోజు 1.28 మిలియన్ పైగా టిక్కెట్లు బుక్ మై షో లో అమ్ముడవ్వడం కూడా రికార్డ్ సృష్టించింది. 2025 లో ఏ భారతీయ సినిమాకీ రాని రేంజ్ లో ఇది నిలిచింది.

రిలీజ్ డే నాడు దేశవ్యాప్తంగా థియేటర్స్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. రెండో రోజు కూడా ప్రతి గంటకు 60,000 టిక్కెట్లు బుక్ మై షో లో సేల్ అవుతూ హైప్ ను మరో లెవెల్ కి తీసుకెళ్ళింది. దసరా సెలవుల ఊపు కూడా తోడవడంతో, ట్రేడ్ వర్గాలు రాబోయే రోజుల్లో వసూళ్లు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నాయి.

రిషబ్ శెట్టి నటనతో పాటు దర్శకత్వంలోనూ తన అద్భుత ప్రతిభను చాటుకున్నాడు. కథలోని ఆధ్యాత్మిక అంశాలు, గ్రామీణతను ప్రతిబింబించే నేటివిటీ కలిపి ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేశాయి.
ట్రేడ్ పండిట్స్ అంచనా ప్రకారం ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా చరిత్రలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ లలో ఒకటిగా నిలుస్తుందని, రికార్డులు వరుసగా తిరగరాస్తుందని స్పష్టమవుతోంది.