టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఇంకా దగ్గుబాటి వెంకటేష్ ఇద్దరు సినిమా పరిశ్రమ కి పిల్లర్స్… దాదాపు 40 సంవత్సరాల కెరీర్ ఉంది ఇద్దరికీ. కానీ ఇప్పుడు మళ్ళి ఒకసారి కలిసి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధం అయిపోయారు. అది కూడా మన అనిల్ రావిపూడి సినిమా అన్న సంగతి తెలిసిందే కదా… మన శంకర వర ప్రసాద్ గారు సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది. సో, ప్రొమోషన్స్ కూడా ఒక రేంజ్ లో సాగుతున్నాయి.
ఆల్రెడీ సినిమా లో ఫస్ట్ సాంగ్, “మీసాల పిల్ల…” సూపర్ హిట్! ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్
వెంకీ మామ మెగాస్టార్ మీద ఉండబోతోందంట… ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే అద్భుతం కదా… అసలు ఈ ప్రోమో చుడండి… సాంగ్ కోసం ఇక ఆగలేం కదా…
ఈ సినిమా లో నయనతార హీరోయిన్… ఇక అనిల్ రావిపూడి స్టైల్ కామెడీ ఇంకా మెగాస్టార్ స్టైల్ లో సినిమా మస్తు గా ఉంటుంది అని అనిల్ ఆల్రెడీ క్లియర్ గా చెప్పేసాడు… సో, సంక్రాంతి కోసం గట్టిగా వెయిటింగ్!