మన మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా ‘మన శంకర్ వార ప్రసాద్ గారు’ గురించే అంతా చర్చ… నిన్ననే కదా దసరా సందర్బంగా “మీసాల పిల్ల” పాట రిలీజ్ చేసారు… ఆ ప్రోమో సూపర్ హిట్ అయ్యింది… లెజెండరీ సింగర్ ఉదిత్ నారాయణ్ గొంతు ఇంకా హైప్ టిస్కోచింది ఈ పాట కి… ఐతే ఈ సినిమా సంక్రాంతి కి రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది కాబట్టి, ప్రొమోషన్స్ కూడా సూపర్ గా స్టార్ట్ చేసాడు అనిల్ రావిపూడి…
ఈ సినిమా నటీనటుల జాబితా కూడా చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి – నయనతారలతో పాటు వీటీవీ గణేష్, కేథరిన్ ట్రెసా, హర్షవర్ధన్, అలాగే సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో బుల్లిరాజు పాత్రతో గుర్తింపు పొందిన రేవంత్ భీమల ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విభిన్నమైన నటీనటులు ఉండటంతో సినిమా కథనానికి మంచి బలం చేకూరుతుందని అంచనా.
ఇక ఈ సినిమాలో ప్రధాన విలన్‌గా మలయాళ నటుడు షైన్ టామ్ చాకో నటించనున్నారని తాజాగా అధికారికంగా ప్రకటించారు. దసరా, దేవర, డాకూ మహరాజ్ వంటి సినిమాల్లో తన విభిన్న నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న షైన్ టామ్ చాకో, ఈ సినిమాలో చిరంజీవికి ఎదురులేని విలన్‌గా కనిపించనున్నారు.
షైన్ స్క్రీన్స్ ఇంకా గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు భారీ స్థాయి ప్రొడక్షన్ విలువలు ఉండబోతున్నాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సినిమా సంక్రాంతి 2026 లో విడుదల కానుంది.