మెగాస్టార్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఉంటాలో, ఆ రేంజ్ ఏ మాత్రం తగ్గకుండా చూస్కుంటా అన్నాడు మన అనిల్ రావిపూడి. ‘సంక్రాంతి వస్తున్నాం’ తో వెంకీ కి కెరీర్ లో అతి పెద్ద బ్లాక్బస్టర్ ఇచ్చి, ఇప్పుడు మెగాస్టార్ కి కూడా అదే రేంజ్ లో హిట్ ఇస్తా అంటున్నాడు…
సినిమా ఎలాగో సంక్రాంతికి రిలీజ్ కదా… సో, మరి అప్పుడే ప్రొమోషన్స్ స్టార్ట్ చేసాడు అనిల్ రావిపూడి. సినిమాలో ఫస్ట్ సాంగ్, “మీసాలపిల్ల…” సాంగ్ ప్రోమో ని సోషల్ మీడియా లో వదిలి సూపర్ అనిపించాడు…
మెగాస్టార్ అసలా నయన్ ని మీసాల పిల్ల అని పిలవడం… ఆ కార్ పైన స్వాగ్ తో కూర్చోడం, అలానే ఆ కర్చీఫ్ తో డాన్స్ అబ్బా సూపర్ అనిపించింది. ఇక మొత్తం పాట గురించి వెయిటింగ్…
ఇక్కడ వరకు ఒక కథ… నెక్స్ట్ బుల్లి రాజు తో ప్రోమో, ఆ ఓవర్ ఆక్షన్ ఆమ్మో సూపర్… అయ్యో మధ్యలో సింగర్ ఉదిత్ నారాయణ్ ప్రోమో మర్చిపోయాం… అది కూడా అదిరింది.
ఒక్క సాంగ్ కి ఇన్ని ప్రోమోస్ ఆ సూపర్ కదా… ఇక ఫైనల్లీ ఫుల్ సాంగ్ ఎల్లుండి అదే 13th న రిలీజ్ అవుతుంది… బి రెడీ!