నవీన్ పోలిశెట్టి అంటే మనకి గుర్తుకు వచ్చేది జాతి రత్నాలు సినిమానే కదా… ఆ సినిమాలో మనన్ని ఎంతగా నవ్వించాడో తెలుసు కదా. నెక్స్ట్ ‘MISS శెట్టి MR పోలిశెట్టి’ సినిమా లో కూడా బాగానే నవ్వించాడు. కానీ ఆ తరవాత ఆక్సిడెంట్ వల్ల సినిమాకి రెండేళ్లు దూరం అయ్యాడు. ఇప్పుడు మళ్ళి సంక్రాంతికి అనగనగ ఒక రాజు సినిమాతో రెడీ గా ఉన్నాడు.
నిన్నే కదా సినిమా నుంచి మంచి పోస్టర్ వచ్చింది అనుకునేలోపు, ఒక మంచి ప్రోమో వదిలారు…
ఈ టీజర్ మొదలవుతుంది జ్యువెలరీ యాడ్‌లా. అందులో మీనాక్షి చౌదరి ఆభరణాల గురించి మాట్లాడుతుంటే, ఒక్కసారిగా వాటిని ధరించి నవీన్ పొలిశెట్టి ఎంట్రీ ఇస్తాడు. ఆ సీన్ మనన్ని నవ్వుకునేలా చేస్తుంది. ఈ జంట మధ్య ఉన్న కామెడీ టైమింగ్, కెమిస్ట్రీ మొత్తం టీజర్‌నే వినోదభరితంగా మార్చాయి.
తన సినిమాల ప్రమోషన్ విషయంలో ఎప్పుడూ కొత్త పంథా చూపించే నవీన్, ఈసారి కూడా అదే క్రియేటివిటీతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశారు. రొటీన్ ప్రమోషన్‌లకు బదులుగా ఎప్పుడూ వింత ఆలోచనలతో ముందుకు వచ్చి అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటారు.
సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం మారి వహిస్తుండగా, సంగీతం మిక్కీ జే మేయర్ అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ కథ, స్క్రిప్ట్ పైనే స్వయంగా నవీన్ పనిచేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ ఆయనకు మరింత స్పెషల్‌గా మారింది.