ఇంటర్నేషనల్ OTT స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్, భారత్‌లో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకంగా హిందీ కంటెంట్‌పై దృష్టి పెట్టింది. అమెజాన్ ప్రైమ్, జీ5 లాంటి ప్లాట్ఫార్మ్‌లకు భిన్నంగా, కంటెంట్ రిలీజ్ చేసింది. కానీ దక్షిణ భారతీయ భాషల్లో ఎక్కువగా ఒరిజినల్ సినిమాలు లేదా సిరీస్‌లు చేయలేదు.
నెట్‌ఫ్లిక్స్ ఇప్పటి వరకు కేవలం తెలుగు, తమిళ సినిమాలను స్ట్రీమ్ చేయడం ద్వారా దక్షిణాలో తన ప్రేక్షకులను పెంచుకుంది…
2024లో, విజయ్ సేతుపతి ‘మహారాజ’ ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన భారతీయ సినిమా అయింది. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ బాస్కర్’ ఇండియాలో 14 వారం వరకు టాప్ 10లో నిలిచింది. ‘పుష్ప 2’, ‘అమరన్’, ‘లియో’, ‘దేవరా’ వంటి సినిమాలు గ్లోబల్ టాప్ 10 నాన్-ఇంగ్లీష్ లిస్ట్‌లో చేరటం, దక్షిణ కథలపై పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తుంది. ఇక వార్ 2 కూడా అదే స్థాయిలో OTT లో హిట్ అయ్యింది…
ఇలాంటి అంచనాల మధ్య, నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఆరు కొత్త తమిళ, తెలుగు ఒరిజినల్ సినిమాలు మరియు సిరీస్‌లను అనౌన్స్ చేసింది.
నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ వైస్ ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్ మాట్లాడుతూ, “తెలుగు, తమిళ సినిమాల నుండి కొత్త కథలను ప్రేక్షకులకు అందించడానికి మేము చాలా ఉత్సాహంగా ఉన్నాం. ఈ లైన్-అప్‌లో థ్రిల్లర్లు, కామెడీలు, డ్రామాలు, రొమాంటిక్ స్టోరీస్ ఉంటాయి” అని పేర్కొన్నారు.
మరి ఆ కొత్త టైటిల్స్ ఏంటో చూద్దామా:
Super Subbu (Telugu) – కామెడీ సిరీస్. దర్శకుడు: మల్లిక్ రామ్. నటులు: సుందీప్ కిషన్. అనుభవం లేని వ్యక్తి ఒక గ్రామంలో సెక్స్ ఎడ్యుకేషన్ బోధించాల్సి వస్తుంది.
Takshakudu (Telugu) – ఫోక్‌లోర్ థ్రిల్లర్. దర్శకుడు: వినోద్అనంతోజు. నటుడు: ఆనంద్ దేవరకొండ. తన గ్రామస్తులను హతమార్చిన తరువాత, కళ్ళేని వ్యక్తి , అతని కుక్క ప్రతీకారం కోసం ప్రయత్నిస్తారు.
Love (Tamil) – దర్శకుడు: బాలాజీ మోహన్. నటులు: అర్జున్ దాస్, ఐశ్వర్య లెక్ష్మి. రెండు విభిన్న వ్యక్తుల మధ్య ఆధునిక ప్రేమ కథ.
Made in Korea (Tamil) – దర్శకుడు: రా కార్తీక్. నటులు: ప్రియాంక మోహన్, పార్క్ హ్యే-జిన్ (స్క్విడ్ గేమ్). ఒక మహిళ తన కలల కోరియా ట్రిప్‌లో సమస్యలు ఎదుర్కొంటుంది, కానీ ఆశ మరియు స్నేహాన్ని కనుగొంటుంది.
Legacy (Tamil) – దర్శకుడు: చారుకేష్ శేఖర్. నటులు: ఆర్. మాధవన్, నిమిషా సజయన్, గౌతమ్ కార్తీక్, గుల్షన్ దేవాయా, అభిషేక్ బెనర్జీ. పవర, వారసత్వం, రిస్క్‌ల చుట్టూ కుటుంబ గ్యాంగ్స్టర్ డ్రామా.
Stephen (Tamil) – సైకాలజికల్ థ్రిల్లర్. దర్శకుడు: మితున్. నటుడు: గోమతి శంకర్. ఒక సైకియాట్రిస్ట్ ఒక హత్యాకారుడిని మూల్యాంకనం చేస్తూ, అంధకారమైన రహస్యంలో చిక్కుకుంటాడు.