రెడీ గా ఉండండమ్మా సోషల్ మీడియా మారుమోగిపోద్ది… యూట్యూబ్ బద్దలైపోద్ది! ఎందుకో తెలుసు కదా… రేపే పవన్ కళ్యాణ్ OG ట్రైలర్ లాంచ్ అవుద్ది మరి!

పవన్ కళ్యాణ్ నటించిన కొత్త సినిమా ‘They Call Him OG’, సెప్టెంబర్ 25, 2025 న థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే కదా. ఆయన గత చిత్రం హరి హర వీర మల్లూ తో పోలిస్తే, ఈ సినిమా కోసం ప్రోమోషన్స్ చాలా తక్కువే జరిగాయి. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ కు కేవలం కొన్ని రోజులే మిగిలినప్పుడు, టీం జోరు పెంచారు!
అలాగే ఈరోజు శ్రియ రెడ్డి ని గీత గా పరిచయం చేసి, తన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేసారు… గన్ పట్టుకుని ఒక మావోయిస్టు లా ఉంది గీత మరి!
థమన్ సంగీతం ఇప్పటికే హిట్ అయింది. విడుదలైన సాంగ్స్ కు బలమైన రియాక్షన్ రావడంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. అయితే, ట్రైలర్ ఇంకా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఇంకా జరగాల్సి ఉంది.
ట్రైలర్ ఇంకా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రేపు అంటే సండే న, సెప్టెంబర్ 21న నిర్వహిస్తున్నారు. ట్రైలర్ ఉదయం విడుదల అవగానే, సాయంత్రం ప్రీ-రిలీజ్ ఈవెంట్ LB స్టేడియంలో జరగనుంది. ఈ ఈవెంట్‌ను థమన్ సంగీత కచేరీగా ప్లాన్ చేసారు, ఇందులో ఆయన సినిమాకు సంబంధించిన సాంగ్స్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తారంట…
మూవీ టీమ్, హైదరాబాద్ లో వాతావరణ పరిస్థితుల కారణంగా ముందుగా శిల్పకళా వేదికలో ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నా, పూర్తి ఏర్పాట్లను చూసి LB స్టేడియాన్ని ఫైనల్ చేసుకున్నారు.
ఈ ఈవెంట్ ద్వారా కాస్ట్ & క్రూ They Call Him OG గురించి ఫాన్స్ తో మొదటిసారి మాట్లాడబోతున్నారు. సినిమా రిలీజ్ సమీపంలో ఉండటం వలన, ఈ అప్‌డేట్స్ ఫైనల్ ప్రోమోషన్స్ కోసం చాలా ముఖ్యంగా ఉంటాయి.