ఓజీ తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి తన స్టైల్, స్వాగ్తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై హైప్ రోజురోజుకీ పెరుగుతూనే ఉంది.
13 ఏళ్ల తర్వాత పవన్–హరీష్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటమే దీనికి ప్రధాన కారణం. 2012లో వచ్చిన ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ ‘గబ్బర్ సింగ్’ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటే ఉన్నాయి.
ఈరోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన BTS వీడియోను రిలీజ్ చేస్తూ… ఆ పాట డిసెంబర్లో రాబోతుందని ప్రకటించారు. ఆ చిన్న క్లిప్‌లో పవన్ కనిపించిన ఎనర్జీ… చాలా కాలంగా ఆయన మూవీస్‌లో కనిపించని ఆ ‘మాస్ వైబ్’ను గుర్తు చేసింది.
పవన్ అద్భుతమైన డ్యాన్సర్ కాకపోయినా… ఆయనకి మాత్రమే ఉన్న ఆ స్టైల్, ఆ స్వాగ్, ఆ బాడీ లాంగ్వేజ్… యూత్‌ని చాలా ఈజీగా ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఆ స్వాగ్‌ని మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడానికి పవర్ఫుల్ ఫ్యాన్‌బాయ్ హరీష్ శంకర్ రెడీ అవుతున్నాడు.
ఈ పాటలో పవన్ స్టైలిష్ మూవ్స్, DSP ఇచ్చే ఎనర్జిటిక్ బీట్స్, హరీష్ శంకర్ తీసిన ఎలివేషన్స్—all combined అయితే… ఈ సాంగ్ కొత్త సంవత్సర వేడుకలలో తెలుగు ప్రేక్షకుల ఫస్ట్ ఛాయిస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.