Native Async

దసరా కానుకగా రాజుగారి గది 4: శ్రీచక్రం’ అఫీషియల్ అనౌన్స్మెంట్…

People Media Factory Announces Raju Gari Gadhi 4: Śrichakram With Director Ohmkar
Spread the love

టాలీవుడ్ లో హారర్ ఫ్రాంచైజ్ కి కొత్త నిర్వచనం ఇచ్చిన ‘రాజుగారి గది’ సిరీస్ మళ్లీ రాబోతోంది. దసరా పర్వదినం సందర్భంగా, సౌత్ ఇండియాలో ప్రతిష్టాత్మకమైన ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తమ తదుపరి భారీ చిత్రంగా ‘రాజుగారి గది 4: శ్రీచక్రం’ ను అధికారికంగా ప్రకటించింది.

ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించబోతున్నది మళ్లీ మన ఓంకార్. ఇటీవలే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన మిరాయి బ్లాక్‌బస్టర్ గా నిలిచిన తర్వాత వస్తున్న ఈ సినిమా మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

శ్రీచక్రం అనే సబ్‌టైటిల్ తో వస్తున్న ఈ నాలుగో భాగం, భయానక హారర్ కి దైవీయమైన స్పర్శను జోడిస్తుంది. విశ్వాసం, పాత లెగసీలు, అదృశ్య శక్తులు… ఇలా ఒక మిస్టరీ కాన్వాస్ మీద ఈ కథ సాగనుంది. రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒక యువతి భయానకంగా గాల్లో తేలుతూ, వెనక ఒక శక్తివంతమైన దేవత విగ్రహం ఉండటం సినిమా టోన్ ని స్పష్టంగా తెలియజేస్తుంది.

కథ నేపథ్యం కాలికాపురం అనే కల్పిత గ్రామం. సాధారణ హారర్ సినిమాల్లో లాగా కాకుండా, ఇందులో ఆధ్యాత్మికత, భయం, కామెడీ – అన్నింటినీ మిళితం చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వబోతోంది.

టెక్నికల్ విభాగంలోనూ టాప్ క్లాస్ టీమ్ పనిచేస్తోంది. సమీర్ రెడ్డి కెమెరా వెనక తన అద్భుతమైన విజువల్స్ తో మంత్ర ముగ్దుల్ని చేయబోతుండగా, ఎస్.ఎస్. థమన్ సంగీతం ఈ కథకి మరో స్థాయి ఇవ్వనుంది.

మొదటి గ్లింప్స్ ని త్వరలోనే విడుదల చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించారు. ఇక వచ్చే ఏడాది దసరా సందర్భంగా ఈ రాజుగారి గది 4: శ్రీచక్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit