ఇందాకే కదా మనం మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వార ప్రసాద్’ సినిమా లోంచి వచ్చిన “మీసాల పిల్ల…” సాంగ్ 75M వ్యూస్ దాటేసింది అని న్యూస్ చూసాం… ఇక ఇప్పుడు కొడుకు రామ్ చరణ్ సాంగ్ “చికిరి చికిరి…” సాంగ్ గురించి మాట్లాడుకోవాలి.
ఈ సాంగ్ కూడా సూపర్ గా ఉంది. అందుకే 100M వ్యూస్ దాటేసింది యూట్యూబ్ లో! ఈ న్యూస్ ని స్పెషల్ గా సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, మేకర్స్ ఈ సాంగ్ మేకింగ్ వీడియో కూడా షేర్ చేసారు. ఈ వీడియో లో ఆ సాంగ్ షూట్ కోసం టీం అంత ఏకంగా ట్రెక్కింగ్ చేసి మరి, ఆ వ్యూ పాయింట్ లో హుక్ స్టెప్ చేసారు.
ఇక ఈ సాంగ్ లో జాన్వీ అందాలకు, మన చరణ్ బాబు పడిపోవడం… ఫుల్ village స్టైల్ లో పాత ఉండడం… ఆ హుక్ స్టెప్ సూపర్ గా ఉంది. ఈ సినిమా లో చరణ్ ఒక village స్పోర్ట్స్ పర్సన్ గా కనిపిస్తాడట, ఇక జాన్వీ ఆల్రెడీ పాట లో చూపించినట్టు, ఈ గ్రామానికి పెద్ద లేదా సర్పంచ్ అయ్యుండచ్చు!
పెద్ది సినిమా ని బుచ్చి బాబు సన డైరెక్ట్ చేయగా, ఈ సినిమా లో శివ రాజ్ కుమార్, దివ్యేన్దు, శోభన, జగపతి బాబు ఇంకా విజి చంద్రశేఖర్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా 27th మార్చ్ న రిలీజ్ అవ్వడానికి రెడీ గా ఉంది!