అసలు ఈ కాలం పిల్లలకి సినిమా గురించి ఏమి తెలుసు అనుకుంటాం కదా… ఇంకా పెద్ద సినిమా స్టార్స్ కిడ్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే, వాళ్ళకేంటి అన్ని ఉన్నాయ్ కష్టం తేలింది అనుకుంటాం… కానీ అందరు అలా ఉండరు… మన anchor సుమ కొడుకు రోషన్ కూడా అలాంటోడే… మోగ్లీ సినిమా తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అసలు సినిమా ట్రైలర్ ఉంది మాస్టారు, అదిరిపోయింది అంతే!
సినిమా రిలీజ్ డేట్ దెగ్గరపడుతుండడం తో లాంచ్ చేసిన ట్రైలర్, అంచనాలను అమాంతం పెంచేసింది! ఇక ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే, ఈ మోగ్లీ 2025 కాలానికి చెందినవాడు. అలానే సినిమా షూటింగ్ లో పరిచమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు… కానీ పోలీస్ ఆఫీసర్ ఏ విలన్ ఇక్కడ…
ఎంత పలుకుబడి ఉన్నా విలన్ తో అమ్మాయి కోసం అమ్మాయి సేఫ్టీ కోసం పోరాడడం సూపర్… అలానే హర్ష లాంటి స్నేహితుడు, రాముడికి ఆంజనేయుడు లాగ కనిపిస్తాడు… అందుకే ట్రైలర్ అదిరిపోయింది… సినిమా మీద అంచనాలు పెంచేసి, రిలీజ్ కోసం వెయిట్ చేసేలా చేస్తుంది!