ఫైనల్ గా ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నా శుభవార్త రానే వచ్చింది… టాలీవుడ్ టాప్ హీరోయిన్ కం ప్రొడ్యూసర్ సమంత బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడమోరు ని పెళ్లి చేసుకుందని వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది…
సమంత దర్శకుడు రాజ్ నివిమోరుతో చాలా రోజులుగా relationship లో ఉందని రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే సమంత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో రాజ్ తో కలిసిన పిక్స్ చాలానే రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు వెలువడుతున్న తాజా సమాచారం ప్రకారం… వీరిద్దరూ ఈరోజు మార్నింగ్ గోప్యంగా పెళ్లి చేసుకున్నారని టాలీవుడ్ వర్గాల మాట. ఇది వీరిద్దరికీ రెండో వివాహం కావడం విశేషం.

ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చెబుతున్నదాని ప్రకారం… సమంత–రాజ్ ఈ రోజు ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయం వద్ద సాంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి పీటలు ఎక్కారట. అధికారిక ప్రకటన మాత్రం ఇంకా విడుదల కాలేదు కానీ… ఈ రోజు ఈవెనింగ్ పబ్లిక్‌గా అనౌన్స్ చేసే అవకాశం ఉందని టాక్.
ఈ వివాహానికి కేవలం 30 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. చిన్న, ప్రైవేట్ సెరిమనీలో సమంత ఎరుపు చీరను ధరించి ఎంతో ఆహ్లాదకరంగా మెరిసిందట. ఇదే సమయంలో రాజ్ మాజీ భార్య శ్యామలి డే నిన్న రాత్రి పెట్టిన క్రిప్టిక్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
“Desperate people do desperate things”… అంటూ ఆమె సోషల్ మీడియాలో రాసిన లైన్ ఇప్పుడు కొత్త చర్చలకు వేదికవుతోంది. రాజ్–శ్యామలి దంపతులు 2022లో విడిపోయారు. అదే ఏడాది సమంత కూడా నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికైతే ఇవన్నీ రూమర్స్ మాత్రమే. అధికారిక సమాచారం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశముంది.