సమంత… మనకు ఎంతో దగ్గరైన ఆ అద్భుతమైన నటి. నిన్న తాను ద ఫ్యామిలీ మాన్ క్రియేటర్ రాజ్ తో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లి అయినా వెంటనే, తాను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కానీ… ఈ హ్యాపీ మూడ్ మధ్య మరో పేరు హైలైట్ అయ్యింది—సమంతకు ఒకప్పుడు అత్యంత సన్నిహితురాలు అయిన బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ Sadhna Singh.
ఒకప్పుడు ‘partner in crime ‘ అని అంత ఫ్రెండ్షిప్ ఉన్న ఇద్దరు ఇప్పుడు… ఒకరినొకరు ఫాలో కూడా చేయడం లేదు. అసలు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ పెళ్లి రోజు సాధనా వేసిన ఒక చిన్న క్రిప్టిక్ స్టోరీ పెద్ద చర్చగా మారిపోయింది.
“The villain plays the victim so well.”
అంటూ పోస్టు చేసిన ఆ స్టోరీ చూసి నెటిజన్స్ ఒక్కసారిగా ఊహాలు మొదలుపెట్టారు. ఇది సమంత గురించేనా? సమంత ఆమె పెళ్లికి పిలవలేదా? ఇలా అనుమానాలు వరుసగా వచ్చాయి.
అయితే సాధనా కూడా నిశ్శబ్దంగా ఉండలేదు. ఒక abusive DM స్క్రీన్‌షాట్ పెట్టి,
“These are educated frustrated living beings… brain frozen.” అని తలను పట్టుకుంది. తర్వాత మరో స్టోరీలో, “My exact reaction since yesterday”
అంటూ… basically తనకు ఈ డ్రామా పై పెద్దగా ఆసక్తే లేదని చెప్పేసింది.
అంతలో… మరో వైపు సమంత గురించి మరో వార్త వైరల్ అవుతోంది— అదే ఆమె పెళ్లి రింగ్!

దాదాపు ₹1.5 కోట్లు విలువైన ఆ రింగ్… అరుదైన lozenge-cut డైమండ్, చుట్టూ ఎనిమిది portrait-cut petals, మధ్యలో 2K డైమండ్… నిజంగా రాయల్టీ లెవల్ డిజైన్.
ఈ రింగ్ చూసిన వెంటనే నెట్లో ఒకే ఒక్క మాట— “క్వీన్” అని…
congratulations సమంత…