యూత్‌లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ కలిగిన టాలెంటెడ్ నటుడు సిద్దు జొన్నలగడ్డ మరోసారి తన కొత్త సినిమా ‘తెలుసు కదా’ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి రెడీ అయ్యాడు. ఈ చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు తెచ్చుకున్న నీరజ కోనా దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్నారు. టి.జి. విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ఈరోజు విడుదలైంది.
ట్రైలర్ లో సిద్దు జొన్నలగడ్డ, హర్షకు ప్రేమలో కంట్రోల్ ఎవరి చేతుల్లో ఉండాలి అన్న టాపిక్‌పై లెక్చర్ ఇస్తూ కనిపిస్తాడు. ప్రేమలో ఆడవాళ్లు కాదు, మగవాళ్లే కంట్రోల్ ఉంచాలి అని సిద్దు చెప్పే డైలాగ్ ఒక్కటే అతడి పాత్ర ఎంత ఇగో తో నడుస్తుందో చూపిస్తుంది. తర్వాత శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నాతో సిద్దు ప్రేమప్రయాణం ఎంతో బోల్డ్ గా చూపించారు.
సినిమాలో సిద్దు ఇగో తో నిండిన యువకుడి పాత్రలో అద్భుతంగా మెరిసాడు. శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా ఇద్దరికీ కూడా మంచి స్థాయి పాత్రలు దక్కాయి. ఇద్దరూ తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ట్రైలర్ చెప్పేస్తుంది.
దర్శకురాలు నీరజ కోనా ఈ తరం ప్రేమ సంబంధాలను నిజాయతీగా చూపించడానికి ప్రయత్నించారు. ప్రేమ, డ్రామా, రొమాన్స్, ఎమోషన్ అన్నీ సమంగా మిళితం చేశారు. ట్రైలర్‌లోని డైలాగ్స్ హార్ట్ టచ్ అయ్యేలా ఉన్నాయి.
కథలో ముఖ్యమైన ట్విస్టులను రివీల్ చేయకుండా స్మార్ట్‌గా ఉంచిన ఈ ట్రైలర్, సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అన్ని కోణాల్లో చూసినా తెలుసు కదా ఈ దీపావళికి విడుదలవుతున్న బ్లాక్‌బస్టర్‌గా కనిపిస్తోంది! సో, అక్టోబర్ 17th సినిమా చూడడానికి రెడీ గా ఉండండి!