మన టాలీవుడ్‌లో విభిన్న కథలతో ఎప్పుడూ ఆకట్టుకునే హీరో శ్రీ విష్ణు, ఈసారి ఒక లవ్-యాక్షన్-కామెడీ డ్రామాలో కనిపించబోతున్నారు. కొనా వేంకట్ ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమాకి జానకిరాం మరెల్ల డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. వెంకటకృష్ణ కర్ణాటి, సీత కర్ణాటి లు స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పి బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
దసరా శుభాకాంక్షల సందర్భంగా, ఈ మూవీకి ‘కాంరేడ్ కళ్యాణ్’ అనే టైటిల్‌ను శక్తివంతమైన ప్రోమో ద్వారా ప్రకటించారు.
కథ 1992 లోని నక్సలైట్ ఉద్యమ కాలం చుట్టూ తిరుగుతుంది. రేడియోలో ‘కాంరేడ్ కళ్యాణ్’ అనే వాంటెడ్ నక్సలైట్ గురించి హెచ్చరికలు వినిపిస్తాయి. పోలీసు డిపార్ట్‌మెంట్ 5 లక్షల రివార్డు ప్రకటించగా, ఆసక్తికరంగా ఆ పోస్టర్‌లను అతనే గోడలపై అతికిస్తున్న సీన్ చూపించారు.
ఈ పాత్రలో శ్రీ విష్ణు రెండు వేరే షేడ్స్ తో కనిపించబోతున్నారు. నక్సలైట్ లీడర్‌గా ఆయన ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్, సాయి శ్రీరాం సినిమాటోగ్రఫీ విజువల్స్, విజయ్ బుల్గనిన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కలసి టైటిల్ ప్రోమోని అద్భుతంగా నిలబెట్టాయి.
మొత్తానికి ఈ మూవీ లో సీరియస్ యాక్షన్ తో పాటు ఒక అందమైన లవ్ స్టోరీ, పుష్కలంగా కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.