రజనీకాంత్ వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 70 పదుల వయసులోనూ రజనీకాంత్ యువకులతో పోటీపడీ సినిమాలు చేస్తున్నాడు. రజనీ హీరోగా వచ్చిన జైలర్ సినిమా ఏ స్థాయిలో హిట్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా రికార్డులను తుడిచివేసింది. కాగా, దీనికి సీక్వెల్గా జైలర్ 2 తెరకెక్కుతోంది. నెల్సన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇప్పటికే ఈ సినిమాలో తెలుగు హీరో బాలకృష్ణ కీలక రోల్ చేస్తున్నారు. అయితే, ఇదే సినిమాలో మరో హీరో కూడా ఎంట్రీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. బాలకృష్ణతో పాటు నాగార్జున కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. నాగార్జున విలన్ రోల్ ప్లే చేస్తున్నట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే రజనీతో కలిసి నాగార్జున కూలీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్నది. కాగా, జైలర్లో కూడా నాగార్జున నటిస్తుండటం అందులోనూ విలన్ రోల్ చేస్తుండటంతో సినిమాపై బజ్ మరింతగా క్రియేట్ అయింది. ఇప్పటి వరకు హీరోగా మెప్పించిన మన్మధుడు నాగార్జున విలన్గా ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. టాలీవుడ్ నుంచి సుమన్, జగపతిబాబు విలన్గా మంచి సక్సెస్ సాధించారు. ఇప్పుడు ఆ కోవలోనే నాగార్జున కూడా విలన్గా మెప్పిస్తారా చూడాలి.
Related Posts

తాజా మామిడి పండ్లను ఎలా గుర్తించాలి
✅ తాజా మామిడిపండ్లను గుర్తించే విధానం: ❌ పైకి నిగనిగలాడుతూ లోపల కుళ్లిపోయిన మామిడిని ఎలా గుర్తించాలి? 👉 ఇలాంటివి కోసిన తర్వాత మాత్రమే అసలు విషయం…
✅ తాజా మామిడిపండ్లను గుర్తించే విధానం: ❌ పైకి నిగనిగలాడుతూ లోపల కుళ్లిపోయిన మామిడిని ఎలా గుర్తించాలి? 👉 ఇలాంటివి కోసిన తర్వాత మాత్రమే అసలు విషయం…

భారత్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి – కొత్త ఉపరకాలు OF.7, NB.1.8 వేగంగా వ్యాపిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ…
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి – కొత్త ఉపరకాలు OF.7, NB.1.8 వేగంగా వ్యాపిస్తున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ…

ఆర్సీబీ కల నెరవేరుతుందా?
ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న అంటారేమో. ఎందుకంటే ఆర్సీబీ గతంలో మూడుసార్లు ఫైనల్కు చేరుకుంది. 2009, 2011, 2016లో కూడా ఫైనల్ వరకు…
ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న అంటారేమో. ఎందుకంటే ఆర్సీబీ గతంలో మూడుసార్లు ఫైనల్కు చేరుకుంది. 2009, 2011, 2016లో కూడా ఫైనల్ వరకు…