నేటి తరానికి స్పూర్తి ప్రదాతలు మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి లని విజయనగరం జిల్లా కలక్టరు రాంసుందర్ రెడ్డి అన్నారు. కలక్టరేటు ఆడిటోరియంలో గురువారం జాతి పిత మహత్మ గాంధీ జయంతి, మాజి ప్రదాని లాల్ బహుదూర్ శాస్త్రి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలక్టరు మాట్లాడుతు మహాత్మ గాంధీ, లాల్ బాహుదూర్ శాస్త్రి వారి ఆశయాల సాదనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం రఘపతి రాఘవ రాజారాం గీతాలాపనతో ప్రారంభంమైంది. గాంధీజీకి దక్షిణఫ్రికాలో ఎదురైన సంఘటనలు, స్వతంత్య పోరాటంలో చేసిన అహింస విధానం, భారత స్వాంతంత్య్రం సాధించడంలో వారి పాత్రను కలక్టరు వివరించారు. మహనీయులు మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి దేశానికి ఎన్నో విదాలుగా సేవలందించారని కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఇతరులకు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు.
గాంధీజీ న్యాయ విద్యను చదివి దేశ ప్రజలకు అమూల్యమైన సేవలందించటంతో పాటు భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన అనుసరించిన అహింసా సిద్ధాంతానికి గుర్తుగా, మహాత్మ గాంధీజీకి నివాళిగా అక్టోబర్ 02ని అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తుందని కలెక్టర్ అన్నారు. అలాగే ఆహార భద్రతను కాపాడటంలో లాల్ బహుదూర్ శాస్త్రి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశాన్నంతటినీ ఏకదాటిపైకి తెచ్చి స్వాతంత్యం సంపాదించి పెట్టడంలో గాంధీజీ కీలక పాత్ర పోషించారన్నారు. దేశంపై చెరగని ముద్ర వేసి జాతిపిత అయ్యారన్నారు. ప్రపంచానికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన ఆయుధాలను పరిచయం చేసిన మహానుభావుడని, ఆ అస్త్రాలను పరిచయం చేయడమే కాక వాటిని ఉపయోగించి భరతమాతకు విదేశీ పాలన నుంచి విముక్తి కలిగించారన్నారు. మనమందరం ఆయన చూపిన మార్గం లో నడుస్తూ, గాంధీజీ కలలు కన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేసి దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు.
జిల్లా జాయింట్ కలక్టరు సేథు మాధవన్ మాట్లాడుతు మహాత్మ గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి భారత దేశ స్వాతంత్య కోసం పోరాటం చేసారన్నారు. వారి పోరాట స్ఫూర్తిని అందరు ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహత్మ గాంధీ, మాజి ప్రదాని లాల్ బహుదూర్ శాస్త్రి, దేశానికి అందించిన సేవలు శ్లాఘనీయమన్నారు. అంతర్జాతీయ స్థాయిలో అనేక దేశాది నేతలు గాంధీ విధానాలను ఆదర్శంగా తీసుకున్నారని అన్నారు సత్యం, అహింస అనే ఆయుధాలతో, ఒక గొప్ప వ్యక్తిత్వంతో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని పడగొట్టి, దేశానికి స్వాతంత్రం తేవడం గాంధీజీ జీవితం నుండి మనం నేర్చుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యు అదికారి శ్రీనివాస మూర్తి, కలక్టరేటు పరిపాలనాధికారి దేవి ప్రసాద్, సి.పి.ఒ. బాలజి, జిల్లా విద్యాశాఖాధికారి మణిక్యంయుడు, మార్కపెడ్ మేనేజరు వెంకటేశ్వరరావు. విజయనగరం మున్సపిల్ కమీషనరు నల్లనయ్య, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి జీవనరాణి. ఐ.సిడి.ఎస్.పి.డి. విమలరాణి, డిఆర్ డి ఎ పిడి శ్రీనివాస్ పాణి, జిల్లా పర్యాటక అధికారి కుమార స్వామి, మైక్రోఇరిగేషన్ పి.డి. లక్ష్మీనారాయణ, జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి పి.గోవిందరాజులు, జిల్లా అధికారులు, తహసిల్దార్లు బాస్కరరావు, టి. గోవింద్, ఉద్యోగులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.