Native Async

తిరుమలలో భారీ వర్షం…తడిసిముద్దైన భక్తజనం

Heavy Rain in Tirumala Devotees Drenched as Weather Turns Suddenly
Spread the love

తిరుమలలో భారీ వర్షం కురిసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తిరుమలలో భారీ వర్షం కురింది. దీంతో స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా భారీగా వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను దేవస్థానం అధికారులు అప్రమత్తం చేశారు.

లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇక, ఘాట్‌ రోడ్లలో కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో అధికారులు, పోలీసులు, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ టీమ్‌తో ఎప్పటికప్పుడు రోడ్లను పరిశీలిస్తున్నారు. వర్షాకాలంలో అడవిలో నివశించే జంతువులు ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీంతో కాలినడకన తిరుమలకు వచ్చేవారిని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ తిరుమలకు అనుమతిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit