ఆసియా ఖండంలో ఏకాకిగా మిగిలిపోయిన దేశం ఉత్తర కొరియా. ప్రపంచ దేశాలు ఈ దేశంలో పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఎన్ని ఆంక్షలు విధించినా ఉత్తర కొరియా తన సైనిక సత్తాను, ఆయుధసత్తాను సరికొత్తగా ప్రపంచానికి చాటిచెప్పుతోంది. రష్యా, చైనా దేశాలు ఆయుధ రంగంలో దూసుకుపోతున్న తరుణంలో ఉత్తర కొరియా కూడా తన అనంతమైన సైనిక శక్తిని ప్రపంచం ముందు ప్రదర్శిస్తోంది. ఇటీవలే ఉత్తర కొరియా హ్వాసాంగ్–20 పేరుతో ఐసీబీఎం క్షిపణిని ప్రదర్శించింది. ఇది అంతర్జాతీయ ఖండాంతర క్షిపణి. ఈ క్షిపణి ప్రదర్శనతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయి.
ప్యాంగ్యాంగ్‌లో ఇటీవలే ఓ భారీ సైనిక పరేడ్‌ను నిర్వహించారు. ఈ పరేడ్‌లో హ్వాసాంగ్–20 ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ హాజరయ్యారు. వేలాదిమంది సైనికులు, ట్యాంకులు, రాకెట్లు, డ్రోన్లు మధ్యన హ్వాసాంగ్–20 ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్తర కొరియా ఇప్పటి వరకు అభివృద్ధి చేసిన క్షిపణుల్లో ఇదే శక్తివంతమైనది.
Read more: అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఉత్తర కొరియా హ్వాసాంగ్–20హ్వాసాంగ్–20 ప్రత్యేకతలు
విశ్లేషకుల అంచనా ప్రకారం హ్వాసాంగ్–20 క్షిపణి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీను చేరగల శక్తిని కలిగి ఉంది. ఈ అంతర్జాతీయ ఖండాంతర క్షిపణి సుమారు 15,000 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా. ఈ క్షిపణి ఏకకాలంలో పలు అణుతలాలను మోసుకెళ్లగలదలని చెబుతున్నారు. ఈ క్షిపణి ఘన ఇంధనంతో పనిచేస్తంది. ఘన ఇంధనంతో నడిచే క్షిపణి కావడంతో తక్కువ కాలంలోనే సిద్ధంచేసి ప్రయోగించేందుకు అనుకూలంగా ఉంటుంది.
ప్రపంచ దేశాల ఆందోళన
ఈ ప్రకటనతో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ వంటి దేశాలు అప్రమత్తమయ్యాయి. ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను పట్టించుకోకుండా ఉత్తర కొరియా కొత్త క్షిపణులను పరీక్షించడం అంతర్జాతీయ శాంతికి ముప్పుగా భావిస్తున్నారు. అమెరికా రక్షణ శాఖ ఇప్పటికే దీనిపై సమీక్ష ప్రారంభించింది.
రాజకీయ సంకేతం
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉత్తర కొరియా ఈ క్షిపణిని ప్రదర్శించడం ద్వారా రెండు సందేశాలను ఇవ్వాలనుకుంది. ఒకటి దేశీయంగా ప్రజలకు తన సైనిక శక్తిపై గర్వభావం కలిగించడం. రెండోది అంతర్జాతీయంగా అమెరికా, దాని మిత్రదేశాలకు హెచ్చరిక ఇవ్వడం. ఉత్తర కొరియా ప్రజలకు తమ దేశం సురక్షితమని, విదేశాలకు వెళ్లి అక్కడ ఇబ్బందులు ఎదుర్కొనడం కంటే కూడా సొంత దేశంలో ఉండటమే మేలని తన ప్రజలకు తెలియజెప్పడంతో పాటు అమెరికా వంటి పెద్ద దేశాలను ఎదుర్కొనగల సత్తా తమకు ఉందని చెప్పడం ఒకెత్తైతే, ఈ అంతర్జాతీయ ఖండాంతర క్షిపణి ప్రయోగం ద్వారా అమెరికాకు కొంత భయాన్ని కలిగించడం, తమ జోలికి వస్తే వాషింగ్టన్‌ను క్షణాల్లో బుగ్గి చేసేస్తామని చెప్పడం కూడా ఈ క్షిపణి ప్రదర్శన ఆంతర్యం.
జోగులాంబ తలపై బల్లి… ప్రళయకాలంలో అమ్మవారే మార్గదర్శం
భవిష్యత్తు ఆందోళనలు
‘హ్వాసాంగ్–20’ ఆవిష్కరణతో ప్రపంచంలో అణు ఆయుధ పోటీ మరింత ముదురనుంది. ఇప్పటికే రష్యా, చైనా, అమెరికా తమ సాంకేతిక శక్తిని పెంచుకుంటున్న వేళ, ఉత్తర కొరియా కూడా ఆ జాబితాలో చేరడం ప్రపంచ శాంతికి కొత్త సవాలనే చెప్పాలి. రష్యా, చైనా, అమెరికా దేశాలు తమ ఆయుధాలను ఇతర దేశాలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి. ఆయుధ పోటీని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా కూడా సరికొత్త ఆయుధాలను తయారు చేస్తూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నది. అయితే, ఉత్తర కొరియా కేవలం తన స్వప్రయోజనాల కొరకే ఈ ఆయుధాలను తయారు చేసుకుంటోంది. ఒకవేళ ఈ దేశం తమ ఆయుధాలను ఇతర దేశాల మాదిరిగానే అమ్మకానికి ఉంచితే భారీగా లాభాలు ఆర్జించగలదు. ప్రపంచ దేశాలతో పోటీపడగలదు. అయితే, ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటే ప్రశ్న ఉదయిస్తోంది. వాషింగ్టన్‌ను ఢీకొట్టగల సత్తా ఉన్న క్షిపణి ఉత్తరకొరియా వద్ద ఉంటే.. ప్రపంచం మనుగడ ఎలా మారిపోతుంది అన్నది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.