ఉప్పాడ తీరం ప్రాంతంలో కాలుష్య నియంత్రణ అంశాలపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో కూలంకషంగా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి Pawan Kalyan కాకినాడ జిల్లాలో ఉన్న పారిశ్రామిక కాలుష్యం, మైనింగ్ మూలంగా తలెత్తుతున్న కాలుష్య ఇబ్బందులపై, పిఠాపురం నియోజకవర్గంలో తలెత్తిన పరిస్థితిపై ఈ సమీక్షలో చర్చించి పూర్తిస్తాయి వివరాలు తెలుసుకున్నారు.

కాకినాడలో చేపట్టిన మత్స్యకారులతో మాట… మంతిలో మత్స్యకారులు ప్రస్తావించిన అంశాలు, వారు వెలిబుచ్చిన సందేహాలపై పీసీబీ నుంచి వివరాలు కనుక్కున్నారు.

కాలుష్య నియంత్రణ మండలి చేపట్టబోయే పొల్యూషన్ ఆడిట్ కి అనుసరించాల్సిన విధివిధానాలపై, కాకినాడ జిల్లాతోపాటు గోదావరి జిల్లాలలో ఉన్న కాలుష్య పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ P. కృష్ణయ్య గారు, మెంబర్ సెక్రటరీ శ్రీ P. శరవణన్ IFS గారు, సీనియర్ ఇంజనీర్లు, సైంటిస్టులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టర్ మరియు SP, ఇతర జిల్లా అధికారులు కాకినాడ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
