కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఉప్పాడ మత్స్యకారులతో మాట… మంతి కార్యక్రమం ముగిసింది ఈ కార్యక్రమంలో భాగంగా వేటకు వెళ్లి మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు బీమా చెక్కులు అందించారు. 18 కుటుంబాలకి రూ. 5 లక్షల చొప్పున బీమా సాయం అందింది. సమావేశంలో మత్స్యకారులు తెలియచేసిన ప్రతి సమస్యను, వారి అభిప్రాయాలను నోట్ చేసుకున్నారు. ఉప్పాడ ప్రాంత మత్స్యకారులు తెలిపిన పారిశ్రామిక కాలుష్యంపై – పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు 100 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్ణయం తీసుకొంటాము. పరిష్కార మార్గాలు సూచించే ప్రక్రియలో పరిశ్రమలు, మత్స్య శాఖ, పీసీబీ, పరిశ్రమల ప్రతినిధులు, మత్స్యకారులు, ఎన్జీవోలు.. స్టేక్ హోల్డర్స్ అందరినీ భాగం చేస్తాము.
ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడలో నా మత్స్యకార సోదరులను, ఆడపడుచులను కలుసుకోవడం ఆనందంగా ఉంది. ఎన్నికల్లో మీకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం తరపున మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మరోసారి హామీ ఇస్తున్నాను. ప్రధానంగా నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలపై తీసుకోనున్న చర్యల వివరాలు:
• సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందిన కాకినాడ జిల్లాకు చెందిన 18 మంది మత్స్యకారులకు పరిహారంగా, వారి కుటుంబాలకు ఒకొక్కరికి రూ. 5 లక్షల చొప్పున ₹90 లక్షల బీమా ఈరోజు అందించడం జరిగింది.
• ఉప్పాడ తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు, సముద్ర కొత్త నుండి ప్రజలను కాపాడేందుకు ₹323 కోట్ల వ్యయంతో, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, వారి సహకారంతో రీటైనింగ్ వాల్ పూర్తి చేసి తీరుతామని హామీ ఇస్తున్నాను..
• ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగా డిజైన్ రూపకల్పనలో నిర్మాణ లోపాలు ఉన్నట్లు గుర్తించాం. ఈ విషయంపై గత నెలలో సైసెఫ్ (CICEF) సంస్థ శాస్త్రవేత్తల బృందం అధ్యయనం చేశారు. దీని కారణంగా బోట్లు తరచుగా ధ్వంసం అవుతున్న విషయం నా దృష్టిలో ఉంది. త్వరలోనే ఈ లోపాల పరిష్కారం కోసం APSDMA సహకారంతో దాదాపు ₹98 కోట్ల వ్యయంతో ఈ డిజైన్ సవరణ పనులు ప్రారంభించనున్నాము.
• మత్స్యకారులతో “మాట – మంతి” కార్యక్రమం నిర్వహించిన సమయంలో నా దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు 100 రోజుల గడువులోగా స్పష్టమైన ప్రణాళికను, ప్రజల ఆమోదంతో అమలు చేయనున్నాము.
• సముద్ర తీరంలో పారిశ్రామిక కాలుష్యంపై – పొల్యూషన్ ఆడిట్ చేపట్టాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వనున్నారు. 3- 4 రోజుల్లో స్వయంగా తీర కాలుష్య ప్రాంతాల్లో పర్యటించి కాలుష్య తీవ్రత తెలుసుకుంటాను.