టైర్లు ఎంత ఖరీదో చెప్పక్కర్లేదు. అందుకే మనం అరిగిపోయే వరకు వాడతాం. అరిగిపోయిన తరువాత వాటిని పక్కన పడేస్తుంటాం. మన బుర్రకు పదును ఉంటే, వస్తువులను వాడుకునే విధంగా మార్చుకోగలిగిన తెలివి ఉంటే ఏ వస్తువునైనా మనం బయటపడేయం. మన అవసరాలకు తగిన విధంగా వాటిని వాడుకుంటాం. అరిగిపోయిన టైరును ఓ వ్యక్తి ఏకంగా కూలర్‌గా మార్చేశాడు. అసలే ఎండాకాలం. రోడ్డు పక్కన ఉండే చిన్నచిన్న దుకాణాల్లోనూ కూలర్ల ఖరీదు వేలల్లో ఉంటోంది. ఇంత ఖర్చుపెట్టి కొనుగోలు చేయాలంటే సామాన్యులకు చాలా కష్టం.
విపరీతమైన శబ్దం
ఇక కూలర్‌లో వాడే మొటార్లు, ఫ్యాన్ విపరీతమైన శబ్దం చేస్తుంటాయి. చల్లదనం సంగతి ఎలా ఉన్నా ఈ శబ్ధంతో అసలు నిద్రే పట్టదు. ఒకదానికోసం కొనుగోలు చేస్తే ఇంకొకటి ఏదో జరిగినట్టుగా… ఎండో గిండో సీలింగ్ ఫ్యాన్ వేసుకుంటే కాస్తైన నిద్రపడుతుంది. చల్లదనం కోసం తెచ్చిపెట్టుకొని దాని రొదను భరించలేక నిద్రలేక సంసారంలో కలహాలు తెచ్చుకునే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారందరికి ఈయన ఎవరో గాని భలే మంచి ఐడియా ఇచ్చాడు. పాత టైర్‌ను ఏకంగా కూలర్‌గా మార్చేసి వావ్ అనిపిస్తున్నాడు. టైర్‌కు ఒకవైపు కూలర్‌లో ఉపయోగించే మ్యాట్‌ను ఏర్పాటు చేసి మరోవైపు టేబుల్ ఫ్యాన్‌ను ఫిట్ చేశాడు. లోపలే చిన్న పంప్ ఏర్పాటు చేసి మ్యాట్‌ను నీళ్లతో తడుపుతున్నాడు. ఇంకేముంది శబ్దంలేని టైర్ కూలర్ రెడీ అయింది. ఇంట్లో ఉండే వస్తువులతో కూలర్ రెడీ అయిపోయింది. దీనికి అయ్యే పెట్టుబడి మన తెలివి మాత్రమే. అందుకే అంటారు తెలివున్నోడు దునియాలో ఎక్కడైనా బతకగలడు అని. మరి మీకు ఎంతటి తెలివి ఉందో మీరే పరీక్షించుకోండి.