భవిష్యత్తును ఊహించి ముందుగానే చెప్పడం అందరికీ సాధ్యమయ్యేపని కాదు. భగవంతుని ఆశీస్సులు, అదృష్టం ఉంటేనే కాలజ్ఞానం చెప్పగలరు. అటువంటివారిలో పోతులూరి వీరబ్రహ్మం, ఆమ్స్టర్డామ్, వంగబాబా ముందు ఉంటారు. బల్గేరియాకు చెందిన బాబా వంగ తన 12వ ఏట బాబా వంగ కళ్లు దెబ్బతినడం, అప్పటి నుంచి భవిష్యత్తును ఊహించి చెప్పడం మొదలుపెట్టింది. 1996లో ఆమె మరణించే వరకు కాలజ్ఞానం చెబుతూనే ఉన్నారు. ఇందులో భాగంగా 2026లో ఏం జగబోతుందో కూడా ఊహించి చెప్పినట్టుగా తెలుస్తోంది.
అఖండ కోసం ప్రసిద్ధ పండితులు శ్రవణ్ మిశ్రా – అతుల్ మిశ్రా
2026లో ప్రపంచంలోని చాలా దేశాల్లో కరువు పరిస్థితులు ఎదురుకానున్నాయి. యుద్ధాల కారణంగా పలు దేశాలు ఆర్థికంగా, సామాజికంగా, తీవ్రంగా నష్టపోతాయి. ఆహారం కొరత దేశాలను పట్టిపీడిస్తుంది. 2026లోనూ పలు దేశాల్లో యుద్ధాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాసియా, గల్ఫ్, యూరప్, ఉత్తర, దక్షిణ అమెరికా దేశాల్లో యుద్ధాలు, కలువు, కాటకాలు, కొట్లాటలు జరిగే అవకాశం ఉంది. ఇక, భారత్‌లోనూ ప్రభావం కనిపిస్తుంది. భారత్‌లో వరదలు, వేడి పెరుగుతుందని, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంటుందని, వరదల కారణంగా జనజీవనం దెబ్బతింటుందని బాబా వంగ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎన్నడూ లేని విధంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా చెప్పారు. మరి బాబా వంగ చెప్పినట్టుగా 2026లో జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.