Native Async

హాలీడేస్‌ తరువాత చైనాలో ట్రాఫిక్‌ ఎలా ఉంటుందో తెలుసా?

China Traffic Jams After Holidays Massive Road Congestion as People Return from Villages
Spread the love

ఎక్కడైనా సరే లాంగ్‌టర్మ్‌ హాలిడేస్‌ ఉంటే మూటాముల్లు సర్ధుకొని సొంత ఊర్లకు పయనమౌతాం. గ్రామాల నుంచి వచ్చిన వాళ్లేతే హాయిగా నాలుగురోజులు మంచిగాలిని, చల్లటి గాలిని, మానసిక ప్రశాంతిని పొందేందుకు ప్రయత్నిస్తారు. నాలుగు రోజులు పల్లెలో ఉంటే నాలుగేళ్లపాటు ఆరోగ్యంగా ఉండొచ్చని అంటారు. మనదగ్గర దసరా, సంక్రాంతి, వేసవి సెలవుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గ్రామాలకు వెళ్తారు. ఇక సెలవులు పూర్తయ్యాక తిరిగి వచ్చేసమయంలో టోల్‌గేట్ల వద్ద ఉండే ట్రాఫిక్‌ చూస్తే ఆశ్చర్యపోతాం. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్‌ ఆగిపోతుంది. ఎంత స్పీడ్‌గా టోల్‌గేట్‌ నుంచి వాహనాలను పంపించినా ఆ గేటు నుంచి బయటకు వచ్చేసరికి హమ్మయ్యా అని గుండెలపై చేయివేసుకుంటాం.

బాబోయ్‌ సెలవులకు ఊరు వెళ్లకూడదు. ఒకవేళ వెళ్లవలసి వస్తే సొంత వాహనంలో కాకుండా ట్రైన్‌లో వెళ్లడం మంచిది అనుకుంటారు. కానీ, ఆ సమయానికి టికెట్లు దొరక్కనో లేదంటే మరే కారణం వలనో సొంత వాహనాలనే ప్రిఫర్‌ చేసుకొని వెళ్తాం. ఇది ప్రతీ ఏడాది సెలవుల సమయంలో ఉండేదే. మనదగ్గరే కాదండోయ్‌ చైనాలో కూడా హాలిడేస్‌ తరువాత భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అవుతుంది. టోల్‌గేట్‌ నుంచి కార్లు, వాహనాలు బయటకు రావడానికి గంటల కొద్ది సమయం పడుతుంది. కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయి ఉంటాయి. ఇలా ఈ వాహనాలన్నీ ఒక్కసారిగా సిటీలోకి ఎంటరైతే అక్కడ మరింత ట్రాఫిక్‌ పెరుగుతుంది. ఊరు నుంచి ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుందో… సిటీ నుంచి ఇంటికి చేరుకోవడానికి అంతే సమయం పడుతుంది. ఇదిగో ఇక్కడిచ్చిన వీడియోపై ఓ లుక్కేయండి మీకే అర్థమౌతుంది.

అంతకంతకు పెరుగుతున్న దగ్గు సిరప్‌ మరణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit