కొండలు, నదులు, సముద్రాలు, పర్వతాలు…ఇవి ఉన్న ప్రాంతాల్లో రోడ్లు వేయడం చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఇలాంటి చోట రోడ్ల నిర్మాణానికి ఖర్చు రెండు మూడింతలు పెరుగుతుంది.
కానీ, తెలివిని ఉపయోగించి, ఇంజనీరింగ్ పనితనంతో, ఆధునిక టెక్నాలజీతో ఆయా ప్రాంతాలలో కూడా చాలా తేలికగా రోడ్లను నిర్మించవచ్చని చైనా ఇంజనీర్లు మరోమారు రుజువుచేశారు. నది పక్కన, కొండ వాలుల్లో ఏర్పాటు చేసిన హైవే నిర్మాణం అద్భుతం అని చెప్పాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపించిన హైవే నిర్మాణం ఎలా ఉందో మీరే చెప్పాలి.