హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇలా ఏ సినిమా ఇండస్ట్రీ తీసుకున్నా… ఆ సినిమా హిట్ కావాలంటే అదిరిపోయే మ్యూజిక్ ఆల్బమ్ ఉండాలి. మ్యూజిక్ ఆల్బమ్‌కి తగ్గట్టుగా డ్యాన్స్ ఉండాలి. ఇప్పటికే ఇండస్ట్రీలోని డ్యాన్స్ మాస్టర్లు తమదైన శైలిలో కొత్త కొత్త స్టెప్పుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఫ్యాన్స్‌కి సరిపోవడం లేదు. జిమ్నాస్టిక్స్ స్థాయిలో స్టెప్పులు కావాలని కోరుతున్నారు. కొత్తదనం కోరుకునే ప్రేక్షకుల కోసం, కొత్తదనాన్ని అందించాలనే తపన ఉన్న హీరోల కోసం, కొత్తగా స్టెప్పులను కంపోజ్ చేయాలనుకునే కొరియోగ్రాఫర్ల కోసం ఇది ప్రత్యేకం. ఇందులో ఓ వ్యక్తి జిమ్నాస్టిక్‌ను మించేలా స్టెప్పులు వేశాడు. తలను కింద ఆనించి కాళ్లు పైకి ఉంచి గిర్రున తిరుగుతూ వావ్ అనిపించాడు.
మనకు తల కిందకు కాళ్లు పైకి పెట్టాలంటేనే కష్టం. పై ప్రాణాలు పైకే పోతాయని భయం. అలాంటిది గ్లోబ్ మాదిరిగా గిర్రున తిరగడం అంటే మామూలు విషయం కాదు. ఈ వీడియో చూసిన తరువాత బహుశా మన సినిమాల్లో కూడా ఇలాంటి స్టెప్పులు కావాలని కోరుకుంటామేమో. దానికి తగ్గట్టుగా ఫ్యాన్స్ సినీ ఇండస్ట్రీలోని డ్యాన్సింగ్ హీరోలకు మెసేజ్‌లు చేస్తారేమో.