ఇప్పటి వరకు మనం ఎన్నో ఛాలెంజ్‌లు చూశాం… రైస్ బకిట్ ఛాలెంజ్, ఐస్ బకిట్ ఛాలెంజ్, ప్లాంట్ ఛాలెంజ్ ఇలా ఎన్నో ఛాలెంజులు మనం చూశాం. మనలో చాలా మంది ఈ ఛాలెంజ్‌లో పాల్గొని ఎంజాయ్ కూడా చేశాం. అయితే, ఇప్పుడు మరో ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. కాఫీ ఛాలెంజ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. కాఫీ ఛాలెంజ్ అంటే అంత మొత్తంలో తాగాలి లేదా ఇంత మొత్తంలో తాగాలి అని కాదు… మీకు పెళ్లయి భార్య ఉంటే, కాఫికప్పు పట్టుకొని నడుము చుట్టూ చేయివేసి కాఫీ తాగాలి.
దీని వలన మనకేం తెలుస్తుంది అంటే… భార్య నడుము మనం పట్టుకునే విధంగా ఉన్నదా లేదా అన్నది తెలిసిపోతుంది. ఇదిగో ఇక్కడ వీడియోలో చూపిన విధంగా చేయివేసి కాఫీ తాగాలి. అలా తాగితే ఛాలెంజ్‌లో గెలిచినట్టే. కాఫీ ఛాలెంజ్ విజయవంతంగా పూర్తిచేస్తే… మీరు కూడా మరికొంతమందికి ఛాలెంజ్‌ను సజస్ట్ చేయవచ్చు. మరి ఈ ఛాలెంజ్‌లో మీరు కూడా పాల్గొని విజయం సాధించాలని ఉందా… మీరూ ఓసారి ట్రై చేసి చూడండి.