నిన్న తెలంగాణ లో ఫ్యూచర్ సిటీ లో జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిధి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో సీఎం రేవంత్ రెడ్డి తో చాల సేపు టాలీవుడ్ ఇంకా సినీ పరిశ్రమ అభివృద్ధి పై చర్చించారు…
అలానే ఈ కార్యక్రమంపై, ముఖ్యమంత్రి శ్రీ. రేవంత్ రెడ్డి విజన్‌పై తన ఆనందాన్ని, అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సమ్మిట్‌కు తనను అతిథిగా ఆహ్వానించినందుకు చిరంజీవి ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తన పోస్ట్ లో CM రేవంత్ రెడ్డి vision గురించి చాల బాగా చెప్పారు…
“నిన్న ఫ్యూచర్ సిటీలో జరిగిన “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్” కార్యక్రమానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన తెలంగాణ C.M శ్రీ.రేవంత్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు. తెలంగాణ రైజింగ్ – 2047 విజన్ లో భాగంగా.. అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి సైతం ప్రాముఖ్యతను ఇస్తూ.. హైదరాబాద్ ను ఫిల్మ్, ఎంటర్టైన్మెంట్ గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది. ఈ మహత్తర కార్యాచరణలో నా దిశా నిర్దేశం కోరడం.. నాకు ఎంతో ఆనందదాయకం. C.M రేవంత్ రెడ్డి గారి విజన్ అలాగే ప్రభుత్వ ప్రోత్సాహంతో మన నుండి మరెన్నో “World Class Projects” రూపుదిద్దాలని, ప్రపంచ సినిమా హైదరాబాద్ పై దృష్టి సారిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు…
నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి కూడా తన ట్విట్టర్ లో మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా నెటిజన్స్ కి తెలిపారు…
అలానే చిరంజీవి, CM తో పాటు, ప్రముఖ businessman ఆనంద మహీంద్రా కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు… ఆయనకి కూడా vision 2047 బాగా నచ్చిందని, మెగాస్టార్ ని కలవడం ఆనందంగా ఉందని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు…
అలానే ఈ సమ్మిట్ కి నిన్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, అక్కినేని అమల, అల్లు అరవింద్, దిల్ రాజు తో పాటు బాలీవుడ్ పవర్ జంట రితేష్ దేశముఖ్ ఇంకా జెనీలియా కూడా పాల్గొని, CM తో ముచ్చటించారు… అలానే ఇంతకూ ముందే బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవగన్ ఫ్యూచర్ సిటీ లో ఒక స్టూడియో కట్టడానికి సిద్ధం గా ఉన్నానని CM తో తెలిపారు.
ఇంకా నిన్ననే అక్కినేని నాగార్జున కూడా అన్నపూర్ణ స్టూడియోస్ ని ఫ్యూచర్ సిటీ లో కూడా నిర్మిస్తామని చెప్పారు. సో, ఈరకంగా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ చాల బాగా ఉండబోతోంది!