Sankranti Festival అంటే మనకు గుర్తుకొచ్చేది పల్లెటూర్లే. ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కోడిపందాలు, జల్లికట్లు. సంక్రాంతికి మనమంతా సొంతూర్లకు వెళ్లి అక్కడే మూడు రోజులపాటు పండుగను జరుపుకుంటాం. ఇది ఆనవాయితీగా వస్తోంది. Sankranti Festival తెలుగు ప్రజలందరికీ కూడా పెద్ద పండుగే. కానీ, Sankranti Festival గురించి ఎవరికీ తెలియని కొన్ని రహస్యాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Sankranti Festival చారిత్రక నేపథ్యం
మనం తినే ఆహారానికి, కట్టుకొనే బట్టలకు, నివశించే ఇంటికీ, ఆరోగ్యాన్ని నిలుపుకొనే మందులకూ, మన వ్యవసాయానికి, అనగా ఆహార సంపాదనకు సంబంధమున్నట్లే మన సంస్కృతికీ అందులో భాగమైన పండుగలకు, ముఖ్యంగా Sankrantiకి సంబంధముంది. వ్యవసాయమనేది ఎలా మొదలైందో కొంచెం చరిత్రలోకెళ్లి తొంగిచూస్తే అర్థమౌతుంది. మనిషి మనుగడకు చెట్ల నుండి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఆహారం లభిస్తుందని గుర్తించిన మనుష్యులు కృత్రిమంగా మొక్కలను, చెట్లను, పెద్ద పెద్ద వృక్షాలను పెంచే నైపుణ్యం సంపాదించారు. మొదట తమ సంచార జీవితానికి తగ్గట్టుగా “పోడు” వ్యవసాయంతో మనుష్యుల మనగలిగారు. దాన్నుండే నదీ తీరాలవెంట స్థిర నివాసమేర్పరుచుకొనే స్థాయికెదిగారు. తన శరీర పెరుగుదలకు, రక్షణకు, పునరుత్పత్తికి తగిన వ్యవసాయాన్ని-పంటలసాగు, పశువుల-పక్షుల పెంపకం, అటవీ ఉత్పత్తుల్నీ కూడగట్టడం, వంట చెరకు, గృహవసతికి తగిన వృక్షాల్ని వృద్ధిచేయడం, జల, జంతువుల్ని వృద్ధి చేయటం మొదలుపెట్టారు.
Sankranti Festival కి పండించే పంటలు
కాలక్రమేణా తనకు తగిన ప్రాంతానికి, పంటకాలానికి అనుగుణమైన పంట మొక్కల సాగు ప్రక్రియను పరిపుష్టం చేసుకొన్నారు. ఆ విధంగా వచ్చినవే వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగి వంటి తృణ ధాన్యాలూ, పెసర, మినుము, కంది, శనగ, అలసంద, చిక్కుడు వంటి పప్పు జాతి పంటలు, వేరశనగ, ఆముదం, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు, కుసుమ వంటి నూనెగింజలు, వివిధ రకాలైన కూరగాయలు, పండ్లు సుగంధ ద్రవ్యాలూ, మందులిచ్చే మొక్కలు. సమాంతరంగా అనేక జంతువులు మనుష్యుల జీవనంలో, అనగా వ్యవసాయంలో భాగమయ్యాయి. పశుపాలన పంటల సాగును పరిపుష్టం చేసింది. మనుష్యుల ఆహార సముపార్జనలో సుస్థిరత ఏర్పడ్డది. అయితే సంఖ్యాపరంగా మనుష్యులు పెరిగినంతగా ఆహార ఉత్పత్తులు పెరగలేదు. ముఖ్యంగా శాస్త్ర జ్ఞానం విస్తరించని ప్రాంతాల్లో తరచుగా ఆహారకొరత ఏర్పడుతూ వచ్చేది.

Sankranti festival Facts
మన దేశంలో కూడా బెంగాల్ కరువొచ్చి ఆకలితో ఎక్కువ మంది చచ్చిపోయారు. దీనిక్కారణం మన వ్యవసాయాన్ని అప్పటి ప్రభుత్వాలు అభివృద్ధి చేయలేదు. అంతేగాక తిండి గింజల పంపకంలో అశ్రద్ద వహించారు. స్వతంత్ర భారతదేశంలో ఆధునిక విజ్ఞాన శాస్త్ర వెలుగులో మన దేశప్రజలు కూడా తమ వ్యవసాయాన్ని మార్చుకొని ఆహారోత్పత్తి పెంచుకోగలిగారు. దాన్నే మనం హరితవిప్లవమని, శ్వేతవిప్లవమని, నీలి విప్లవమని చెప్పుకొన్నాం. ఈ విప్లవాలకు మూలం శాస్త్ర విజ్ఞానం, శ్రమజీవుల త్యాగం. అయితే ఇక్కడ పంటలకు, పశువులకు కీలకంగా ఉన్న మన వ్యవసాయానికి, మన సంస్కృతిలో భాగమైన Sankranti కి ఉన్న సంబంధ మేమిటి?
Sankranti Festivalని పొంగల్ అని ఎందుకు పిలుస్తారు
ఈ పండుగ సూర్యమాన కొలమానాలకు తగినట్లుగా వచ్చిందని విశ్లేషకుల భావన. భూకేంద్ర సిద్ధాంత దశలో అనగా సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణానికి మరల్తాడనీ, మన వాతావరణ మార్పుకి అది సూచికని చెప్పుకొచ్చారు. ఈ పండుగను దక్షిణాదిన ‘పొంగల్’ అంటారు. అనగా కొత్త వరిధాన్యంతోనూ, పాలు, చెరకు రసం, లేత కొబ్బరితోనూ పొంగించిన అత్యంత మధురమైన వంటకం దానికి ప్రతీక, అలానే అన్ని విధాలా మేత, నీళ్లూ, ఆహారం, గింజలు లభించే ఈ దశలో పశువులకు, పక్షులకు కూడా ఇదొక ముఖ్య పండుగ. ప్రాంతాల్ని బట్టి పంటల మార్పిడికి తగిన సమయం కూడా ఇది. బియ్యం పిండితో గారె, లడ్డు వంటి వాటిని చేసుకొని నలుగురు కలిసి తింటారు. అవియల్, పొంగల్ రుచికరంగా చేసుకొని పండుగ జరుపుతారు. కొన్ని ప్రాంతాల్లో కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరి నదీ పరీవాహక ప్రాంతాల్లో ఈ sankranti festival సందడి ఎక్కువ. కారణం ఈ ప్రాంతంలో పంటలు ఎక్కువగా ఉండి పండుగల శోభను పెంచుతాయి.
Sankrantiకి పశువులకు ఉన్న సంబంధం
సమాజంలో మొదటి నుండి ఉత్పత్తి వృత్తులేగాక ఇంకా అనేక వృత్తులతో జీవించే ప్రజలు అనేక మంది ఉన్నారు. అటువంటి వారే గంగిరెద్దులు, బుడబుక్కలు, జముకుల కథకులు. ఆహర అభద్రతలో ఉన్న వీరు కూడా ఈ పండగ సందర్భంగా సమాజంలో భాగస్వాములవుతారు. తెలుగు రాష్ట్రాలు, Tamilnadu, Kerala వంటి రాష్ట్రాల్లో సముద్రతీర ప్రాంతంలో బ్రతికే జాలర్లకు తగిన సంక్రాంతి పండగ రూపాల్ని చూస్తాం. వ్యవసాయంలో అనేక రకాలుగా ఉపయోగపడే పశువుల్ని ముస్తాబు చేస్తారు. చాలా చోట్ల జల్లికట్టు, పశువుల పందేలు జరుపటం ఆనవాయితీ. కొన్నిచోట్ల కోడిపందేలు, గొర్రె పొట్టేళ్ల పోటీలు ఈ పండగ రోజుల్లో అత్యంత సంబరంగా జరుపుతారు. పల్లెకు దూరంగా పట్టణాలు, నగరాల్లో బ్రతుకుతున్నా, ఎంత ఆధునిక సంస్కృతిని అబ్బించుకొన్నా ఈ పండగల కోసమే తప్పక పల్లెలకు వెళ్లి వ్యవసాయంలో జీవిస్తున్న బందుమిత్రులను కలుస్తుంటాం. ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నాం. ఇక సంక్రాంతి అంటే గొబ్బెమ్మలు, ముగ్గులూ, పోటీలు మన సాంప్రదాయం. సంక్రాంతి అంటే గంగిరెద్దులు, జముకల కథలు వంటి కళా రూపాల ప్రదర్శనలు బందు మిత్రుల సంగమాలు. అందుకే సంక్రాంతి అంటే మనందరికి అంతిష్టం.