ప్రియాంక చోప్రా, ఐశ్వర్య రాయి, దీపికా పదుకొనె… ఇలా చాల మంది ఇండియన్ యాక్టర్స్ హాలీవుడ్ లో నటించారు… ఇక ఇప్పుడు బాలీవుడ్ యాక్షన్ స్టార్ విద్యుత్ జమ్వాల్ కూడా మొదటిసారిగా హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు… ఆ సినిమా ఏంటో తెలుసా??? అదే ‘స్ట్రీట్ ఫైటర్’. అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం, అదే పేరుతో ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపిన వీడియో గేమ్ సిరీస్‌కు లైవ్-యాక్షన్ అడాప్టేషన్. కిటావో సకురాయి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రధాన తారాగణం ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఇటీవల విడుదలయ్యాయి.
అయితే అందరి చూపులను ఆకర్షించింది… ధ్యాసీమ పాత్రలో విద్యుత్ జమ్వాల్ ఫస్ట్ లుక్!
ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా గుండు గీసుకోవడం, ఆ మిస్టిక్ వైబ్‌తో కనిపించడం, వెంటనే ఇండియన్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.

ధ్యాసీం… స్ట్రీట్ ఫైటర్ యూనివర్స్‌లో అత్యంత ముఖ్యమైన పాత్రల్లో ఒకటి. మిస్టిక్ యోగి… గ్రామస్తుల ఆరాధ్యుడు… టెలికినెటిక్ శక్తులు, యోగా పవర్స్‌తో కూడిన ఆధ్యాత్మిక యోధుడు. 1994లో ఈ పాత్ర స్ట్రీట్ ఫైటర్ వీడియో గేమ్ సిరీస్‌లో మొదట కనిపించింది.

విడుదలైన పోస్టర్‌ను చూస్తే:
ధ్యాసీం పాత్రకు విద్యుత్ ఒక పర్ఫెక్ట్ ఫిట్ అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియన్ సినిమాల్లో ఎంత పెద్ద యాక్షన్ హీరో అయినా… ఆయనకు దక్కాల్సిన గుర్తింపు పూర్తిగా రాలేదని అభిమానుల అభిప్రాయం. ఇక ఈ భారీ హాలీవుడ్ యాక్షన్ బిగ్గీ ద్వారా తన ప్రతిభకు ప్రపంచస్థాయి గుర్తింపు రావాలని వాళ్లు ఆశిస్తున్నారు.
ఈ చిత్రంలో విద్యుత్‌తో పాటు నోవా సెంథినియో, ఆండ్రూ కోజి, కాలినా లియాంగ్, రోమన్ రేన్స్, డేవిడ్ డాస్ట్‌మాల్‌చియన్, కోడి రోడ్స్, ఆండ్రూ షుల్జ్, ఎరిక్ ఆండ్రే, 50 సెంట్, జేసన్ మొమోవా లాంటి బిగ్ కాస్ట్ సభ్యులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
స్ట్రీట్ ఫైటర్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16, 2026న విడుదల కానుంది.