రాధికా… తను ఇటు తెలుగు ప్రేక్షకులకి, తమిళ్ ప్రేక్షకులకి పరిచయమే… ఇంకా చెప్పాలంటే టీవీ లో పిన్ని సీరియల్ గుర్తుండే ఉంటుంది కదా… అప్పటి నుంచి మనందరికీ పరిచయమే… ఇక ఇప్పుడు తాను ఎప్పుడు వేయని ఒక మంచి చార్కిటెర్ తో మన ముందుకు రాబోతోంది…
ఈసారి ఈ సీనియర్ నటి చేసిన ప్రయోగం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 63 ఏళ్ల వయసులో రాధికా శరత్‌కుమార్ ‘Thai Kizhavi ’ కోసం పూర్తిగా ట్రాన్సఫార్మ్ అయ్యారు. నిన్న రిలీజ్ అయిన టీజర్ లో ఆమ్మో అనిపించేలా ఉంది రాధికా… ఆ గెట్ అప్, ఆ స్లాంగ్, ఆ రఫ్ హ్యాండ్లింగ్ ఇంకా చెప్పాలంటే టీజర్ చూడాల్సిందే…
ఈ సినిమాలో రాధికా… మొత్తం డి-గ్లామర్ లుక్ లో, వృద్ధ గ్రామ మహిళగా కనిపిస్తున్నారు. మేకప్, స్టైల్ అన్నీ పక్కన పెట్టి, పూర్తిగా పాత్రలో లీనమయ్యారు. శివ కుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. టీజర్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది, ఈ కథలో ఎవరికీ భయపడని, తన కోసం జీవించే ఓ ఒంటరి మహిళే కథానాయిక.
సాధారణంగా ఈ వయసులో చాలామంది సీనియర్ నటీమణులు తల్లి, అత్త, అమ్మమ్మలాంటి సేఫ్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ రాధికా మాత్రం ఆ దారిని ఎంచుకోలేదు. నటిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉన్నప్పటికీ, ఆమె ఈ కఠినమైన, సాహసోపేతమైన పాత్రను అంగీకరించారు. ఈ నిర్ణయం సీనియర్ ఆర్టిస్టులకు ఒక బలమైన ఉదాహరణగా నిలుస్తోంది.
‘థాయ్ కిళవీ’ అనే టైటిల్‌కు అర్థం ‘వృద్ధ తల్లి’. హీరో లేకపోయినా, కథ బలంగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని తమిళ సినిమా ఎన్నోసార్లు నిరూపించింది. ఈ చిత్రంలో కూడా హీరో అంటే కథే… కథానాయిక అంటే రాధికానే.
ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది నివాస్ కె ప్రసన్న. అలాగే అరుల్‌దాస్, బాలా సర్వణన్, మునీష్‌కాంత్, ఇళవరసు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై వ్యాపార పరంగా కూడా డిమాండ్ పెరిగినట్లు సమాచారం.