ప్రస్తుతం టాలీవుడ్ లో నవ్వుల రారాజు అంటే నవీన్ పోలిశెట్టి అనే చెప్పాలి! ఆల్రెడీ ‘జాతి రత్నాలు’ సినిమాతో మనన్ని నవ్వించాడు… నెక్స్ట్ అనుష్క తో చేసిన ‘Miss శెట్టి Mr పోలిశెట్టి’ సినిమా తో కొత్త కాన్సెప్ట్ సినిమా చూపించాడు. ఇక ఇప్పుడు ‘అనగనగ ఒక రాజు’ సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు అది కూడా ఈ సంక్రాంతి పండగకి!
ఈ రోజు నవీన్ బర్త్డే సందర్బంగా, మేకర్స్ ఒక మంచి పాట “రాజు గారి పెళ్లి లో…” ప్రోమో రిలీజ్ చేసారు… ప్రోమో లో నవీన్ మీనాక్షి ఇద్దరు సూపర్ గా ఉన్నారు… ఇక ఇది పూర్తి పార్టీ సాంగ్ ల ఉంది. ప్రోమో ఐతే అదిరిపోయింది! ఇక మొత్తం పాట ఇంకొంచంసేపట్లో రిలీజ్ అవ్వబోతోంది!
ఈ సాంగ్ ని Mallareddy Engineering కాలేజీ లో స్టూడెంట్స్ కోలాహలం మధ్యలో రిలీజ్ అవ్వబోతోంది!
ఇక సినిమా ఐతే 14th జనవరి న రిలీజ్ అవ్వబోతోంది… సో, పండగ బొమ్మ కి రెడీ గా ఉండండి!