భారీ అంచనాల మధ్య ఇటీవల విడుదలైన శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక ‘చాంపియన్’ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. వైజయంతి సినిమా సంస్థ నిర్మించడంతో పాటు మంచి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి రిలీజ్‌కు ముందే మంచి బజ్ ఏర్పడింది. అయితే, ఫైనల్ అవుట్‌పుట్ మాత్రం అంత బ్లాక్బస్టర్ అని రాలేదు!
రివ్యూలు మిక్స్‌గా ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సినిమా ఓ డీసెంట్ స్టార్ట్ ను నమోదు చేసింది. మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘చాంపియన్’ సినిమా తొలి రోజు సుమారు రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది డీసెంట్ ఓపెనింగ్‌గా చెప్పుకోవచ్చు. పలుచోట్ల థియేటర్లలో సినిమా నిలకడగా రన్ అవుతోంది.
టెక్నికల్‌గా చూస్తే, సినిమా ప్రొడక్షన్ విల్యూస్ బలంగా కనిపిస్తున్నాయి. అవి సినిమాకు అదనపు బలాన్ని అందించాయి. పాటలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి, ముఖ్యంగా మాస్ సెంటర్లలో కొన్ని సాంగ్స్ బాగా వర్క్ అవుతున్నాయి.
లీడ్ పెయిర్ రోషన్ ఇంకా అనశ్వర జంట సినిమా బలాల్లో ఒకటిగా నిలుస్తోంది. రోషన్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఇద్దరి జోడీ కొన్ని చోట్ల బాగా కనెక్ట్ అవుతోంది.
మొత్తంగా మిక్స్ టాక్ కొనసాగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజులు సినిమాకు చాలా కీలకం కానున్నాయి. వీకెండ్‌లో సినిమా తన పట్టు నిలబెట్టుకోగలిగితే, ‘చాంపియన్’ బాక్సాఫీస్ వద్ద స్టేబుల్ రన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.