మెగాస్టార్ – ఈ పేరు కి పరిచయం అక్కర్లేదు అనుకుంట… అసలు మొన్న వచ్చిన మన శంకర వర ప్రసాద్ సినిమాలో లో ఎంతలా mesmerise చేసాడో తెలుసు కదా… ఈ సినిమాలో వింటేజ్ లుక్ తో డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టాడు. ఐతే మన చిరు ఫస్ట్ సినిమా ఏంటో తెలుసు కదా… అదే పునాది రాళ్ళూ… ఆ సినిమా ఫస్ట్ షూటింగ్ అయ్యింది కానీ, ప్రాణం ఖరీదు సినిమా ఫస్ట్ రిలీజ్ అయ్యింది.
ఐతే ఈరోజు పునాది రాళ్ల సినిమా కోసం కెమెరా ముందుకు వచ్చిన ఫస్ట్ రోజు సందర్బంగా చిరు సోషల్ మీడియా లో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు…
ఆ పోస్ట్ లో ఎం రాసారంటే… “ఈరోజు “పునాదిరాళ్లు” సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఒక అందమైన చందమామ కథ లాంటి అనుభూతి. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన ఆ చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాది రాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు. – చిరంజీవి”.
ప్రస్తుతానికి చిరు మన శంకర వర ప్రసాద్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ బాబీ దర్శకత్వం లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు!