బిగ్ బాస్ తెలుగు 9 కంటెస్టెంట్స్ వీళ్ళే…

Bigg Boss Telugu Contestants
Spread the love

బిగ్ బాస్…
బిగ్ బాస్ తెలుగు…
బిగ్ బాస్ తెలుగు 9…

ఇలా మనం హిందీ లోనే బిగ్ బాస్ చుసేటప్పడి నుంచి, తెలుగు లో బిగ్ బాస్ చూసే కాలం లోకి వచ్చాం కదా… అలానే ఈ తెలుగు బిగ్ బాస్ లో అప్పుడే ఎనమిది సీసన్స్ కంప్లీట్ చేస్కుకుని, తొమ్మిదవ సీజన్లో కి అడుగుపెట్టబోతున్నాం… అలానే ఇంతకూ ముందు సీసన్స్ లో అంతకు ముందు సీజన్ లో ఆట చూసి వచ్చే వాళ్ళు కంటెస్టెంట్స్. అది ఎంతో కొంత హెల్ప్ అయ్యేది. కాబట్టి, అది ఎనిమిదవ సీజన్లో లో పెద్ద బ్యాక్ డ్రాప్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ అంత ప్లాప్ అయ్యాక, సెకండ్ హాఫ్ లో పాత సీజన్ ల కంటెస్టెంట్స్ ని కొంత మందిని టిస్కోచి మల్లి ట్రాక్ లోకి తీస్కోచ్చారు.

అలానే అందుకే ఇప్పుడు ఫార్మటు మొత్తం మార్చాల్సి వచ్చింది… అందుకే నాగార్జున ఆల్రెడీ ప్రోమో లో ఈ సీజన్లో లో రెండు హౌసెస్ ఉంటాయి అలానే ఈ సీజన్లో లో బిగ్ బాస్ నే మార్చేస్తున్నాం అన్నాడు. ఇంకా చాలదు అన్నట్టు, ఇప్పుడు నార్మల్ అంటే కామన్ పీపుల్ కి కూడా ఛాన్స్ ఉంటది అని చెప్పి బిగ్ బాస్ అగ్ని పరీక్షా పెట్టారు…

ఈ షో లో నవదీప్, బిందు మాధవి ఇంకా అభిజీత్ ని JUDGES గా పెట్టి, శ్రీముఖి ని ANCHOR కం JUDGE గా పెట్టి షో మొదలుపెట్టారు… అలానే 40 మంది నుంచి 15 మందిని సెలెక్ట్ చేసి షో ENTERTAINING గా చేసారు అలానే వాళ్ళకి అన్ని ఇన్ని కాదు చాల పరీక్షలు పెట్టారు. నిన్న నే ఈ షో కి శుభం కార్డు కూడా వేశారు. మొత్తం 15 మందిలో ఇద్దరినీ ELIMINATE చేసి, 13 మందిలో బిగ్ బాస్ సీజన్ 9 లాంచ్ స్టేజి మీదే సెలెక్ట్ అయ్యే వాళ్ళ నేమ్స్ చెప్తారంటే మరి…

మరి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం… ప్రియా, సోల్జర్ పవన్ కళ్యాణ్, మాస్క్ పర్సన్ హరీష్, దమ్ము శ్రీజ ని కంఫర్మ్ అంటున్నారు. ఇంకా ఒక సీట్ కి “అబ్బా నాగు పాము కాటువేసింది…” ఫేమ్ నాగ లేకపోతె డెమోన్ పవన్ ని సెలెక్ట్ చేస్తారంట… వీలైతే ఇంకో ఇద్దరినీ వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా పెడతారంట… చూద్దాం!

ఇక సెలబ్రిటీ ల విషయానికి వస్తే: రీతూ చౌదరి, ఇమ్మానియేల్, రాము రాథోడ్, తనూజా గౌడ, ఆశా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, సంజనా గార్లానీ ఉండచ్చు అంటున్నారు. మొత్తం 15 మెంబెర్స్ ని హౌస్ లోకి పంపి, సెకండ్ వీక్ ఇంకో ఇద్దరో ముగ్గురో హౌస్ లోకి వెళ్ళచ్చు అంట.

ఇది మన బిగ్ బాస్ హౌస్ కబుర్లు… మరి రేపు లాంచ్ ముచ్చట్లతో మళ్ళి కలుద్దాం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *